కొలంబో వరుస పేలుళ్లపై సినీ ప్రముఖుల ఆగ్రహం

వరుస పేలుళ్లతో ఆదివారం ఉదయం శ్రీలంక ఉలిక్కిపడింది. రాజధాని కొలంబోలో జరిగిన ఈ దాడుల్లో ఇప్పటివరకు 166 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఈ దాడులను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. * ప్రజలు ప్రార్థనలు చేసుకుంటుంటే.. దాడులకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు మనల్ని మింగేస్తాయి. ద్వేషం పేరుతో సమాజాన్ని విడదీయాలని చూస్తున్నవారిపై ఓ కన్నేసి ఉంచాల్సిన అసవరం మన పౌరులకు ఉంది- ప్రకాశ్‌ రాజ్‌ * […]

కొలంబో వరుస పేలుళ్లపై సినీ ప్రముఖుల ఆగ్రహం
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2019 | 5:45 PM

వరుస పేలుళ్లతో ఆదివారం ఉదయం శ్రీలంక ఉలిక్కిపడింది. రాజధాని కొలంబోలో జరిగిన ఈ దాడుల్లో ఇప్పటివరకు 166 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఈ దాడులను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

* ప్రజలు ప్రార్థనలు చేసుకుంటుంటే.. దాడులకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు మనల్ని మింగేస్తాయి. ద్వేషం పేరుతో సమాజాన్ని విడదీయాలని చూస్తున్నవారిపై ఓ కన్నేసి ఉంచాల్సిన అసవరం మన పౌరులకు ఉంది- ప్రకాశ్‌ రాజ్‌

* శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగాయని తెలిసి చాలా బాధపడ్డాను. లంక ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నాను- విశాల్‌

* ఓ మై గాడ్‌. కొలంబోలోని సిన్నమన్‌ హోటల్‌ నుంచి నేను బయటికి వచ్చిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. నేను నమ్మలేకపోతున్నాను- రాధికా శరత్‌కుమార్‌

* ఈస్టర్‌ పర్వదినాన జరిగిన ఈ దాడిని చూసి గుండెపగిలిపోయింది- సుధీర్‌బాబు

* ఇది జరిగి ఉండకూడదు. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారు ఎంత బాధపడుతున్నారో ఊహించడానికి కూడా భయంగా ఉంది. దేవుడా..కాపాడు- నివేదా థామస్‌

* ఈస్టర్‌ సండే ట్రాజెడీగా మారిపోయింది. రాక్షసులకు దయ అనేదే ఉండదు. బలహీన సమయాల్లోనే కుటుంబాలపై, పిల్లలపై దాడులు చేస్తుంటారు- సిద్ధార్థ్‌

* షాకింగ్.. బాధాకరం- సౌందర్య రజనీకాంత్‌

* శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరగడం నిజంగా బాధాకరం. హింస అనేది ఓ చెయిన్‌ రియాక్షన్‌లా మారిపోయిందని ఎవ్వరూ గుర్తించకపోవడం దురదృష్టకరం. దీనికి ముగింపు పలకాలి- జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ (బాలీవుడ్‌ నటి)

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్