Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

మహారాష్ట్రలో సెలబ్రిటీల ‘ హంగామా ‘ ! ‘ పొలిటికల్ లీడర్లలో జోష్ !

Celebrites and Politcal Leaders Casting Their Vote, మహారాష్ట్రలో సెలబ్రిటీల ‘ హంగామా ‘ ! ‘ పొలిటికల్ లీడర్లలో జోష్ !

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సెలబ్రిటీలు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఆమిర్ ఖాన్, రితీష్ దేశ్ ముఖ్, నేటికీ బ్యూటీగా వెలుగొందుతున్న మాధురీ దీక్షిత్, మరో బ్యూటీ, నటి కూడా అయిన పద్మినీ కొల్హాపురి, ఇంకొక నటి దియా మీర్జా తమ ఓట్లు వేశారు. ముంబై.. పశ్చిమ బాంద్రా లోని ఓ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన ఆమిర్ ఖాన్.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరాడు. తన భార్య కిరణ్ రావు తో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి తన భార్య లారా దత్తాతో కలిసి ఓటు వేశారు. పద్మినీ కొల్హాపురి పశ్చిమ అంధేరీలో, దియా మీర్జా ముంబైలో, సినీ నటుడు, గోరఖ్ పూర్ ఎంపీ రవికిషన్ గోరె గావ్ లో ఓట్లు వేశారు. లాతూర్ లోని పోలింగ్ కేంద్రంలో రితేష్ దేశ్ ముఖ్, ఆయన సతీమణి జెనీలియా డిసౌజా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రితేష్ సోదరులు అమిత్, ధీరజ్… లాతూర్ సిటీ, లాతూర్ రూరల్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

ఇక రాజకీయ నాయకుల్లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన భార్య అమృతతో కలిసి నాగపూర్ లో ఓటు వేశారు. ఎన్సీపీ సీనియర్ నేత సుప్రియా సోలె.. పూణే జిల్లాలోని బారామతిలో, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నాగపూర్ జిల్లాలో తమ ఓట్లు వేశారు. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో తిరిగి కాషాయ జెండాను ఎగురవేయడానికి బీజేపీ తహతహలాడుతోంది. మరి-శివసేన-బీజేపీ పొత్తు ఎంతవరకు లాభిస్తుందో చూడాలి..

Celebrites and Politcal Leaders Casting Their Vote, మహారాష్ట్రలో సెలబ్రిటీల ‘ హంగామా ‘ ! ‘ పొలిటికల్ లీడర్లలో జోష్ !

Celebrites and Politcal Leaders Casting Their Vote, మహారాష్ట్రలో సెలబ్రిటీల ‘ హంగామా ‘ ! ‘ పొలిటికల్ లీడర్లలో జోష్ !

పోలింగ్ సమరం

12 గంటల వరకు హర్యానాలో 23 శాతం పోలింగ్ నమోదు

21/10/2019,2:08PM
Celebrites and Politcal Leaders Casting Their Vote, మహారాష్ట్రలో సెలబ్రిటీల ‘ హంగామా ‘ ! ‘ పొలిటికల్ లీడర్లలో జోష్ !

పోలింగ్ సమరం

12 గంటల వరకు మహారాష్ట్రలో 14 శాతం పోలింగ్ నమోదు

21/10/2019,2:07PM
Celebrites and Politcal Leaders Casting Their Vote, మహారాష్ట్రలో సెలబ్రిటీల ‘ హంగామా ‘ ! ‘ పొలిటికల్ లీడర్లలో జోష్ !

పోలింగ్ సమరం

బరిలో 3,237 మంది అభ్యర్థులు

21/10/2019,2:07PM
Celebrites and Politcal Leaders Casting Their Vote, మహారాష్ట్రలో సెలబ్రిటీల ‘ హంగామా ‘ ! ‘ పొలిటికల్ లీడర్లలో జోష్ !

పోలింగ్ సమరం

మహారాష్ట్ర వ్యాప్తంగా 96,661 పోలింగ్ కేంద్రాలు

21/10/2019,2:07PM
Celebrites and Politcal Leaders Casting Their Vote, మహారాష్ట్రలో సెలబ్రిటీల ‘ హంగామా ‘ ! ‘ పొలిటికల్ లీడర్లలో జోష్ !

పోలింగ్ సమరం

ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్

21/10/2019,2:07PM
Celebrites and Politcal Leaders Casting Their Vote, మహారాష్ట్రలో సెలబ్రిటీల ‘ హంగామా ‘ ! ‘ పొలిటికల్ లీడర్లలో జోష్ !

పోలింగ్ సమరం

రెండు రాష్ట్రాలతో పాటు 51 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకు ఎన్నికలు

21/10/2019,2:06PM
Celebrites and Politcal Leaders Casting Their Vote, మహారాష్ట్రలో సెలబ్రిటీల ‘ హంగామా ‘ ! ‘ పొలిటికల్ లీడర్లలో జోష్ !

పోలింగ్ సమరం

ఓటు హక్కు వినియోగించుకున్న మోహన్ భగవత్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అమీర్ ఖాన్, శరద్ పవార్, అజిత్ పవార్

21/10/2019,2:06PM
Celebrites and Politcal Leaders Casting Their Vote, మహారాష్ట్రలో సెలబ్రిటీల ‘ హంగామా ‘ ! ‘ పొలిటికల్ లీడర్లలో జోష్ !

పోలింగ్ సమరం

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కొనసాగుతోన్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

21/10/2019,2:02PM

Related Tags