ఉత్తరాఖండ్ మాజీ సీఎంకు సీబీఐ ఉచ్చు!

CBI to file FIR against Harish Rawat in sting video case, ఉత్తరాఖండ్ మాజీ సీఎంకు సీబీఐ ఉచ్చు!

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్‌ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. 2016 మార్చిలో బలపరీక్షకు ముందు కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆయన ప్రయత్నించినట్లు ఓ స్టింగ్ ఆపరేషన్ బయటపెట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ‘‘సీబీఐ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు మేము కోర్టుకు వెల్లడించాం..’’ అని సీబీఐ తరపు న్యాయవాది సందీప్ టాండన్ పేర్కొన్నారు.

కాగా ఈ నెల 20న సీబీఐ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో రావత్‌పై చేసిన దర్యాప్తు నివేదికను సీబీఐ గతనెలలోనే ఉత్తరాఖండ్ హైకోర్టుకు సమర్పించింది. 2016లో తొమ్మిది మంది రెబల్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకురావడంపై హరీశ్ రావత్ ఓ జర్నలిస్టుతో మాట్లాడుతున్నట్టు వెలుగుచూసిన స్టింగ్ ఆపరేషన్‌ వీడియో సంచలనం సృష్టించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదనీ.. కుట్రపూరితంగా తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని రావత్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *