సుజనా చౌదరి ఆస్తులపై సీబీఐ దాడులు

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆస్తులపై సీబీఐ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఆయనకు చెందిన మూడు స్థానాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో బెస్ట్ అండ్ కౌంటర్ పేరుతో వ్యాపారాన్ని సుజనా చౌదరి నిర్వహిస్తున్నారు. మాజీ సీబీఐ డైరక్టర్, టీడీపీ నేత విజయ రామారావు కుమారుడితో కలిసి సుజనా ఈ వ్యాపారం చేస్తున్నారు. ఇందుకోసం చెన్నైలోని ఒక జాతీయ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో […]

సుజనా చౌదరి ఆస్తులపై సీబీఐ దాడులు
Follow us

| Edited By:

Updated on: Jun 01, 2019 | 4:05 PM

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆస్తులపై సీబీఐ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఆయనకు చెందిన మూడు స్థానాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో బెస్ట్ అండ్ కౌంటర్ పేరుతో వ్యాపారాన్ని సుజనా చౌదరి నిర్వహిస్తున్నారు. మాజీ సీబీఐ డైరక్టర్, టీడీపీ నేత విజయ రామారావు కుమారుడితో కలిసి సుజనా ఈ వ్యాపారం చేస్తున్నారు. ఇందుకోసం చెన్నైలోని ఒక జాతీయ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. బెస్ట్ అండ్ కౌంటర్ పేరుతో తీసుకున్న రుణాలు అన్నీ అక్రమంగా సుజనా కంపెనీకి తరలించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీనిపై సీబీఐ మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. కాగా వీటిపై గతంలో ఈడీ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.