సీబీఐకి ‘నో’ ఎందుకు చెప్పామంటే? సంజయ్ రౌత్

మహారాష్ట్రలో సీబీఐ ఇన్వెస్టిగేషన్లకు ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించిన కారణాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లోకల్ కేసుల దర్యాప్తులో సీబీఐ జోక్యం చేసుకుంటోందని, ఇది రాష్ట్ర హక్కులను దుర్వినియోగం చేయడమే అవుతుందని ఆయన చెప్పారు. జాతీయ సమస్యల విషయానికి వస్తే దర్యాప్తు చేసేందుకు ఈ సంస్థకు అధికారాలు ఉన్నాయని, కానీ ముంబై పోలీసులు ఇదివరకే ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసుల్లో జోక్యం చేసుకునేందుకు దానికి అధికారం లేదని ఆయన అన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి, […]

  • Umakanth Rao
  • Publish Date - 7:28 pm, Thu, 22 October 20

మహారాష్ట్రలో సీబీఐ ఇన్వెస్టిగేషన్లకు ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించిన కారణాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లోకల్ కేసుల దర్యాప్తులో సీబీఐ జోక్యం చేసుకుంటోందని, ఇది రాష్ట్ర హక్కులను దుర్వినియోగం చేయడమే అవుతుందని ఆయన చెప్పారు. జాతీయ సమస్యల విషయానికి వస్తే దర్యాప్తు చేసేందుకు ఈ సంస్థకు అధికారాలు ఉన్నాయని, కానీ ముంబై పోలీసులు ఇదివరకే ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసుల్లో జోక్యం చేసుకునేందుకు దానికి అధికారం లేదని ఆయన అన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి, మహారాష్ట్ర పోలీసులకు సొంత హక్కులంటూ ఉంటాయి. అయితే ఈ హక్కులలో  ఈ సంస్థ జోక్యం చేసుకుంటోంది గనకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని సంజయ్ రౌత్ వివరించారు. ఏమైనా మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం ఈ తరుణంలో రాజకీయ వివాదమవుతోంది.