ఏపీ సీఎంకు సీబీఐ కోర్టు షాక్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ సీబీఐ కోర్టు షాకిచ్చింది. ముఖ్యమంత్రి అయినా కోర్టు హాజరు నుంచి నిరవధికంగా మినహాయింపు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. జనవరి పదో తేదీన హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. క్విడ్ ప్రో కో విధానంలో అక్రమాస్తులు కూడగట్టారన్న ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ జగన్.. సీఎం అయిన తర్వాత నుంచి ప్రతీ వారం కోర్టులో హాజరు నుంచి మినహాయింపు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న […]

ఏపీ సీఎంకు సీబీఐ కోర్టు షాక్
Follow us

|

Updated on: Jan 03, 2020 | 5:13 PM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ సీబీఐ కోర్టు షాకిచ్చింది. ముఖ్యమంత్రి అయినా కోర్టు హాజరు నుంచి నిరవధికంగా మినహాయింపు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. జనవరి పదో తేదీన హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.

క్విడ్ ప్రో కో విధానంలో అక్రమాస్తులు కూడగట్టారన్న ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ జగన్.. సీఎం అయిన తర్వాత నుంచి ప్రతీ వారం కోర్టులో హాజరు నుంచి మినహాయింపు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జగన్.. తరపున ఆయన న్యాయవాది కోర్టుకు హాజరై.. ఎప్పటికప్పుడు మినహాయింపు తీసుకుంటున్నారు. అయితే, ప్రతీ శుక్రవారం హాజరు నుంచి తనకు నిరవధిక మినహాయింపు ఇవ్వాలని జగన్ గతంలో సీబీఐ న్యాయస్థానాన్ని కోరారు. అప్పట్లో జగన్ అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ప్రతీ వారం జగన్ న్యాయవాది సమర్పించే మినహాయింపు రిక్వెస్టును మన్నిస్తూ వచ్చింది.

తాజాగా ఈ శుక్రవారం సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణకు రాగా… న్యాయమూర్తి ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి అయినా నిరవధికంగా మినహాయింపు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పిన న్యాయమూర్తి.. వచ్చే శుక్రవారం (జనవరి 10న) హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?