జగన్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టు షాకింగ్ డెసిషన్

Jagan's disproportionate assets case, జగన్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టు షాకింగ్ డెసిషన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సీబీఐ కోర్టు అంగీకరించింది. గతంలో కూడా ఇదే పిటీషన్‌ వేయగా..జగన్‌కు వ్యక్తిగత హాజరు ఇవ్వలేమంటూ హైకోర్టు కొట్టివేసింది. అయితే, ఇప్పుడు ఎందుకు పిటిషన్‌ను తాము అనుమతించాలని సీబీఐ కోర్టు జగన్ తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది. అయితే గత పరిస్థితులు.. ఇప్పటి పరిస్థితులు వేరని.. పరిణామాలు మారిపోయాయని..కాబట్టి ప్రస్తుతం విచారణ చేపట్టవచ్చని జగన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. వారి వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు జగన్ పిటిషన్‌ను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

2011 నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయన కోర్టుకు హాజరయ్యారు. సీఎం అయిన  హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో కొద్దిరోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో కోరారు. కోర్టులో తనకు బదులుగా తన లాయర్ హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్రోటోకాల్ అంశాలు, భద్రతా పరమైన అంశాల వల్ల సాధ్యం కాదని, కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలంటూ సీఎం జగన్ పిటిషన్‌లో కోరారు.  అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదని.. హైదరాబాద్ రావడానికి ఖర్చు ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఓ విధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారంగా మారిందని పిటిషన్‌లో ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో కోర్టు పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *