కావేరి పిలుస్తోంది… సమంత!

Cauvery is calling will you respond Samantha Akkineni post in Instagram, కావేరి పిలుస్తోంది… సమంత!

కావేరి నది పరిరక్షణ కోసం సద్గురు జగ్గీవాసుదేవ్ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ఆయనకు ప్రముఖ సమంత మద్దతు తెలిపారు. లక్ష మొక్కల్ని నాటే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీని కోసం తన అభిమానుల సహకారం కోరారు. ‘కావేరీ పిలుస్తోంది. మీరు స్పందిస్తారా! ఈ వెబ్‌సైట్‌లో మీ విరాళాలు అందించండి. మీరు, నేను కలిస్తే.. లక్ష మొక్కల్ని నాటేందుకు సహకరించగలం’ అని సామ్‌ పోస్ట్‌ చేశారు. దీంతోపాటు ప్లకార్డు పట్టుకుని ఉన్న వీడియోను కూడా షేర్‌ చేశారు. రూ.42 విరాళం అందిస్తే.. ఒక్క మొక్కను నాటిన వారు అవుతారని తెలిపారు. సామ్‌ ఇటీవల ‘ఓ బేబీ’ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళ హిట్‌ ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *