రూ. 4వేల కోసం రోగిని కొట్టి చంపిన ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు

ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాకానికి ప్రతిరోజూ ఏదో ఒక చోట ఎవరో ఒకరి ప్రాణం పోతుండటం మనం తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. ప్రైవేటు నిర్లక్ష్యం, ఫీజుల భారంతో ప్రజలకు చుక్కలు చూపిస్తుంటాయి ప్రైవేటు యజమాన్యాలు. కానీ, ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు.

రూ. 4వేల కోసం రోగిని కొట్టి చంపిన ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు
Follow us

|

Updated on: Jul 03, 2020 | 4:20 PM

ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాకానికి ప్రతిరోజూ ఏదో ఒక చోట ఎవరో ఒకరి ప్రాణం పోతుండటం మనం తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. ప్రైవేటు నిర్లక్ష్యం, ఫీజుల భారంతో ప్రజలకు చుక్కలు చూపిస్తుంటాయి ప్రైవేటు యజమాన్యాలు. కానీ, ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. రూ. 4వేల బిల్లు కోసం రోగిని అతి దారుణంగా కొట్టి చంపేశారు. అదంతా అక్కడి సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డుకావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప‍్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన సుల్తాన్‌ ఖాన్‌ అనే 44ఏళ్ల వ్యక్తి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దాంతో అతడి బంధువు చమన్‌, సుల్తాన్‌ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్యం కోసం ఎంత ఖర్చవుతుందని చమన్‌.. డాక్టర్లును ముందుగానే అడిగాడు..దానికి వారు… వారు సమాధానంగా బాధితుడికి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేశాక చెప్తామన్నారు. ముందు రూ.5 వేలు కట్టాలని చెప్పారు. చమన్‌ అలానే చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రి వర్గాలు మరో నాలుగు వేలు చెల్లించాలని చెప్పారు. అప్పుడు చమన్‌ ముందే ఐదువేలు కట్టామని చెప్పడంతో అవి బెడ్‌ చార్జెస్ మాత్రమేనని..చికిత్స ఫీజులు మరో నాలుగు వేలు చెల్లించాల్సిందేనని చెప్పారు. అయితే తమకు ముందుగా అంత డబ్బు అవుతుందని చెప్పలేదని, తమవద్ద అంత డబ్బులేదన్న బాధితుడి బంధువులు.. తమను డిశ్చార్జ్ చేయాల్సిందిగా కోరారు.

ఈ క్రమంలోనే ఆస్పత్రి సిబ్బంది, రోగి బంధువులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారి..రోగి సుల్తాన్‌పై ఆస్పత్రి సిబ్బంది దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో రోగి బంధువులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రోగిపట్ల ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..