మరోసారి బన్నీ క్యాథ‌రిన్ జోడీగా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ చిత్రం చేయనున్నాడు. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ర‌ష్మిక మంథాన లేదంటే కియారా అద్వానీని తీసుకోవాల‌ని మేకర్స్ భావిస్తున్నార‌ట . ఇక ముఖ్య పాత్ర కోసం బెంగ‌ళూరు భామ క్యాథ‌రిన్ థ్రెసాని తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే క‌నుక నిజ‌మైతే బ‌న్నీతో ఈ అమ్మడు జోడి క‌ట్ట‌డం నాలుగో సారి అవుతుంది. గ‌తంలో క్యాథ‌రిన్ బ‌న్నీ స‌ర‌స‌న ఇద్దరమ్మాయిలతో , సరైనోడు , […]

మరోసారి బన్నీ క్యాథ‌రిన్ జోడీగా
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2019 | 6:49 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ చిత్రం చేయనున్నాడు. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ర‌ష్మిక మంథాన లేదంటే కియారా అద్వానీని తీసుకోవాల‌ని మేకర్స్ భావిస్తున్నార‌ట . ఇక ముఖ్య పాత్ర కోసం బెంగ‌ళూరు భామ క్యాథ‌రిన్ థ్రెసాని తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే క‌నుక నిజ‌మైతే బ‌న్నీతో ఈ అమ్మడు జోడి క‌ట్ట‌డం నాలుగో సారి అవుతుంది. గ‌తంలో క్యాథ‌రిన్ బ‌న్నీ స‌ర‌స‌న ఇద్దరమ్మాయిలతో , సరైనోడు , రుద్రమదేవి చిత్రాల్లో నటించింది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి హిట్ చిత్రాలుగా నిలిచాయి. ముచ్చటగా మూడోసారి వస్తున్నఈ కాంబోపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో బ‌న్నీని స‌రికొత్త లుక్‌లో చూపించ‌నున్నాడు త్రివిక్ర‌మ్.