Breaking News
  • సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ లో పనిచేస్తున్న సెక్షన్ అఫిసర్ కు కరోనా పాజిటివ్ గుర్తింపు.. ఇటీవల ఢిల్లీ వెళ్లాడని తెలిసి కరోనా టెస్టులు... టెస్టు చేసిన అనంతరం పాజిటివ్ గా వచ్చినట్లు గుర్తింపు.. గాంధీ ఆస్పత్రి కి తరలించిన అధికారులు.. బిఆర్కే భవనం మొత్తం షానిటైజేషన్ చేస్తున్న అధికారులు.
  • మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
  • దేశవ్యాప్తంగా మొత్తం 1418 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఈ రోజే 167 పాజిటివ్ కేసులు నమోదు. దేశ వ్యాప్తంగా కరోనా తో 45 మంది మృతి. ఈ ఒక్క రోజే 13 మంది కరోనా తో మృతి చెందినట్లు వెల్లడి. కరోనా నుంచి 123 మంది డిశ్చార్జి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ.
  • ఉక్రెయిన్​లో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు. తిండి లేక ఆకలితోనే గడుపుతున్న విద్యార్థులు. చేతిలో చిల్లి గవ్వ లేక ఎన్నో ఇబ్బందులు. కరోనా రక్కసి మింగేస్తుందేమోననే భయంతో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు.
  • తెలంగాణ లో ఇప్పటి వరకు 97 కేసులు నమోదు. ప్రస్తుతం 77 మంది వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు. ఈ ఒక్క రోజు 15 పాజిటివ్ కేసులు నమోదు. 14 మంది డిశ్చార్జ్,6 మృతి...

‘డియర్ కామ్రేడ్’కు ‘కాస్టింగ్ కౌచ్’కు మధ్య లింకేంటి.?

Dear Comrade Vijay Devarakonda Casting Couch, ‘డియర్ కామ్రేడ్’కు ‘కాస్టింగ్ కౌచ్’కు మధ్య లింకేంటి.?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 26న దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. రీసెంట్‌గా రిలీజైన టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘కాస్టింగ్ కౌచ్’.. ‘మెసేజ్ ఓరియెంటెడ్…

‘కాస్టింగ్ కౌచ్’.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో దీనిని ఎక్కువగా వాడతారు. ఈ మధ్యకాలంలో తెగ పాపులర్ కూడా అయింది. అయితే ఇది ఒక్క సినిమా రంగంలోనే కాదు చాలా రంగాల్లో అమ్మాయిలను ఎక్స్‌ప్లాయిట్ చేయడం జరుగుతోంది. ఆఖరికి అది క్రీడారంగంలో కూడా ఉందని చెప్పవచ్చు. అవకాశాలు కావాలంటే, తమను సంతృప్తి పరచాలనే చీప్ మెంటాలిటీ వ్యక్తులు దాదాపు చాలా రంగాల్లో ఉన్నారు. ఇక ఈ పాయింట్‌ను ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో చాలా సెన్సిటివ్‌గా డీల్ చేయనున్నారట. ఈ సినిమా పూర్తిగా సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిందని సమాచారం.

హీరోయిన్ రష్మిక మందన్నా.. ఇందులో క్రికెటర్ లిల్లీ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నేషనల్ క్రికెటర్ అవ్వాలనుకునే తరుణంలో కొంతమంది పెద్దలు అవకాశాలు కావాలంటే తమను సంతృప్తి పరచాలని అడుగుతారని తెలుస్తోంది. ఈ కాస్టింగ్ కౌచ్ మీద దర్శకుడు అద్భుతంగా డీల్ చేశాడని ఇండస్ట్రీ టాక్.

అసలు కథ ఇదేనా… 

బాబీ(విజయ్ దేవరకొండ) తన మనసుకు నచ్చినవి, తనకు కరెక్ట్ అనిపించిన చేస్తూ.. వాటి కోసం పోరాడుతుంటాడు. అతడి జీవితంలోకి మహిళా క్రికెటర్ లిల్లీ రాకతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. భిన్న ధృవాలు కలిగిన వీరి అనుబంధంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనేది చిత్ర కథాంశం అని సోషల్ మీడియాలో ఈ స్టోరీ లైన్ వైరల్ అవుతోంది.

ఏది ఏమైనా స్టోరీ లైన్ చూస్తుంటే.. విజయ్ దేవరకొండకు మరో హిట్ ఖాయమనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై అటు సినీ ప్రముఖుల్లోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Related Tags