మహిళా అధికారిణిపై దౌర్జన్యం.. ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదు

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యానికి దిగారన్న ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సరళ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా వెంకటాచలం మండల పరిధిలోని అనికేపల్లిలో కోటంరెడ్డి అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డికి సంబంధించిన లేఅవుట్‌కు పంచాయితీ కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని కోటం రెడ్డి అడిగారని, ఆ విషయం పరిశీలిస్తానని తాను చెప్పినా.. మూడు రోజుల […]

మహిళా అధికారిణిపై దౌర్జన్యం.. ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదు
Follow us

| Edited By:

Updated on: Oct 06, 2019 | 4:37 AM

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యానికి దిగారన్న ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సరళ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా వెంకటాచలం మండల పరిధిలోని అనికేపల్లిలో కోటంరెడ్డి అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డికి సంబంధించిన లేఅవుట్‌కు పంచాయితీ కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని కోటం రెడ్డి అడిగారని, ఆ విషయం పరిశీలిస్తానని తాను చెప్పినా.. మూడు రోజుల క్రితం ఫోన్లో బెదిరించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సమయంలో మద్యం సేవించి అనుచరులతో కలిసి తన ఇంటికి వచ్చిన కోటంరెడ్డి దౌర్జన్యానికి దిగారని సరళ ఆరోపించారు. నీటి పైపు లైను ధ్వంసం చేశారని, విద్యుత్ సరఫరాను నిలిపివేసి, కేబుల్ వైర్ ను కట్ చేశారని సరళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో పోలీసులు ఇంటి వద్దకు వచ్చి ఫిర్యాదు తీసుకున్నా.. కేసు పెట్టేందుకు శుక్రవారం అర్ధరాత్రి స్టేషన్‌కు వెళ్తే మాత్రం ఎవరూ అందుబాటులో లేకుండా పోయారని సరళ వాపోయారు. మండల స్థాయి అధికారుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల గతేంటని ఆమె నిలదీశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి, ఆయన అనుచరుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..