Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

‘కే టాక్స్’ దందాలోనూ కోడెల..క్రికెటర్‌కు కుచ్చుటోపీ

ఇప్పటి వరకు ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడిపై, కుమార్తెపై అవినీతి అభియోగాలు వచ్చాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వీరిద్దరూ ‘ కే టాక్స్’ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ కేసులు నమోదయ్యాయి. వీటిపై కోడెల ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అధికార పార్టీ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులు నమోదవుతున్నాయని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా కోడెలపైనే నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ క్రికెట్‌ క్రీడాకారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు శివరామ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశాారు.

వివరాల్లోకి వెళ్తే..శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బి.నాగరాజు క్రికెట్‌లో ఆంధ్ర రంజీ జట్టుకు ఆడాడు. ఆయనకు గతంలో భరత్‌చంద్ర అనే వ్యక్తితో పరిచయం ఉంది. అతను రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కోడెల శివరామ్‌ వద్దకు నాగరాజును తీసుకెళ్లాడు. ఒప్పందం ప్రకారం 2017 డిసెంబర్‌ 31న ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో రూ.15 లక్షలు శివరామ్‌కు నాగరాజు చెల్లించాడు. నెలలు గడిచినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. శివరామ్‌ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆయన తండ్రి శివప్రసాదరావును ఫోన్‌లో సంప్రదించానని, ఆయన నుంచి కూడా ఎలాంటి సమాధానం రాలేదని నాగరాజు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తామని సీఐ ఆళహరి తెలిపారు.