హృతిక్‌ రోషన్‌పై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Case Filed Against Actor Hrithik Roshan At KPHB Police Station, హృతిక్‌ రోషన్‌పై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌పై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. సెక్షన్‌ 420, 406 కింద కేసు నమోదు చేసారు పోలీసులు. కల్ట్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా హృతిక్‌ వ్యవహరిస్తున్నారు. అయితే ఫిట్‌నెస్‌ సెంటర్‌ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని శశి అనే భాదితుడు ఫిర్యాదు చేసాడు . ఫిట్‌నెస్‌ ప్యాకేజీ కింద రూ.17,490 నుంచి రూ.36,400 వరకూ వసూలు చేసారని తెలిపారు. స్లాట్స్‌ ఇవ్వడం లేదని ప్రశ్నించిన వారిని కల్ట్‌ వెబ్‌సైట్‌లో బ్లాక్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. తాను కల్ట్‌ ఫిటినెస్‌ సెంటర్‌పై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు శశి వెల్లడించారు.

హ‌ృతిక్ రోషన్ బ్రాండింగ్ చేయడంతో నమ్మి కొందరు  డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే 500 మందికి మాత్రమే ఆ సెంటర్‌లో జిమ్ చేసుకునే అవకాశం ఉన్నా 1800 మంది వరకూ స్లాబ్స్ ఇస్తున్నారు కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్ నిర్వాహకులు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *