జీహెచ్ఎంసీ ఎక్స్ ఆఫిషియో ఓటు హక్కుపై హైకోర్టులో విచారణ… సెక్షన్ 90(1)ని కొట్టివేయాలని పిటిషన్

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు హక్కుపై విచారణకు చేపట్టింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.

జీహెచ్ఎంసీ ఎక్స్ ఆఫిషియో ఓటు హక్కుపై హైకోర్టులో విచారణ... సెక్షన్ 90(1)ని కొట్టివేయాలని పిటిషన్
Follow us

|

Updated on: Dec 03, 2020 | 12:52 PM

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు హక్కుపై విచారణకు చేపట్టింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. పార్లమెంట్ సభ్యులకు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కును సవాల్ చేస్తూ… బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 90(1) కొట్టివేయాలని పిటిషన్‌లో అనిల్ కుమార్ కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం, ఎస్ఈసీ, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు జనవరి 4కు వాయిదా వేసింది.