కమల్‌ రేపిన రగడ.. రాజుకుంటున్న నిప్పు

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ చేసిన హిందూ టెర్రరిస్ట్ కామెంట్లపై మరింత రగడ రాజుకుంటూనే ఉంది. ఢిల్లీలో సహా పలు ప్రాంతాల్లో కమల్‌పై కేసులు నమోదు కాగా.. తాజాగా ఆయన సొంత రాష్ట్రంలో  రామకృష్ణ అనే వ్యక్తి కమల్‌పై ఫైర్ అయ్యాడు. హిందూవుల మనోభావాలను కించపరుస్తున్నాడంటూ కమల్‌పై కరూర్ జిల్లా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో సెక్షన్ 153ఏ, 295ఏల కింద కమల్‌పై పోలీసులు కేసు […]

కమల్‌ రేపిన రగడ.. రాజుకుంటున్న నిప్పు
Follow us

| Edited By:

Updated on: May 15, 2019 | 1:17 PM

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ చేసిన హిందూ టెర్రరిస్ట్ కామెంట్లపై మరింత రగడ రాజుకుంటూనే ఉంది. ఢిల్లీలో సహా పలు ప్రాంతాల్లో కమల్‌పై కేసులు నమోదు కాగా.. తాజాగా ఆయన సొంత రాష్ట్రంలో  రామకృష్ణ అనే వ్యక్తి కమల్‌పై ఫైర్ అయ్యాడు. హిందూవుల మనోభావాలను కించపరుస్తున్నాడంటూ కమల్‌పై కరూర్ జిల్లా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో సెక్షన్ 153ఏ, 295ఏల కింద కమల్‌పై పోలీసులు కేసు ఫైల్ చేసుకున్నారు.

కాగా ఇటీవల ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ హాసన్.. స్వతంత్ర భారతదేశంలో తొలి టెర్రరిస్ట్ హిందూనే అని.. గాంధీని చంపిన నాథురామ్ గాడ్సే ఓ ఉగ్రవాది అంటూ కమల్ వ్యాఖ్యానించాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా హిందూ సంఘాల కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. మతాల మధ్య కమల్ లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారంటూ పలువురు ఫైర్ అయ్యారు. కాగా చిలకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు సౌందర్ రాజన్ కూడా ఈ వివాదంపై స్పందించారు. నాథురాం గాడ్సే చేసిన నేరానికి మొత్తం హిందూ సమాజానికి ఆపాదించడం తప్పని ఖండించారు. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, కమల్‌ హాసన్ వ్యాఖ్యలను సమర్ధించారు. గాంధీని చంపిన గాడ్సేను మహాత్ముడంటారా..? లేక రాక్షసుడంటారా..? అని ఆయన ప్రశ్నించారు. గాడ్సే ఉగ్రవాదేనని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. అయితే తన వ్యాఖ్యలపై ఇంత రగడ జరుగుతున్నా.. కమల్ మాత్రం నోరు విప్పలేదు.

ఇలా ఉండగా.. కమల్ వ్యాఖ్యలపై ఢిల్లీలో అశ్వినీ ఉపాధ్యాయ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ వివాదం తమిళనాడుకు సంబంధించినది కనుక.. ఆ రాష్ట్రంలోనే పిటిషనర్ కోర్టుకెక్కవచ్చునని సూచించింది.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!