కరోనాను కూడా అనుకూలంగా మలుచుకున్న కంపెనీ.. 20 శాతం వ‌ృద్ధిరేటు సాధించిన ‘కార్స్ 24’

కరోనా మహమ్మారి వల్ల చాలా దేశాలు, రాష్ట్రాలు, నగరాలు లాక్‌డౌన్‌లో చిక్కుకొని విలవిలలాడాయి. నెలల తరబడి కొనసాగడం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. చిరు ఉద్యోగులు, పేద ప్రజలు, వలస కూలీలు చాలా ఇబ్బందిపడ్డారు.

కరోనాను కూడా అనుకూలంగా మలుచుకున్న కంపెనీ.. 20 శాతం వ‌ృద్ధిరేటు సాధించిన 'కార్స్ 24'
Follow us

|

Updated on: Nov 25, 2020 | 6:42 PM

కరోనా మహమ్మారి వల్ల చాలా దేశాలు, రాష్ట్రాలు, నగరాలు లాక్‌డౌన్‌లో చిక్కుకొని విలవిలలాడాయి. నెలల తరబడి కొనసాగడం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. చిరు ఉద్యోగులు, పేద ప్రజలు, వలస కూలీలు చాలా ఇబ్బందిపడ్డారు. సొంత గ్రామాలకు వెళ్లడానికి ప్రయాణ సౌకర్యాలు లేక అల్లాడిపోయారు. కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు అన్ని నష్టాల బాట పట్టాయి. ఇటువంటి సమయంలో ఒక కంపెనీ లాభాలను సాధించింది. కరోనాను తనకు అనుకూలంగా మలుచుకొని 20 శాతం వ‌ద్ధి రేటు సాధించింది.

ఢిల్లీకి చెందిన కార్స్ 24 సంస్థ భారత్‌లో సరికొత్త స్టార్టప్‌ను సృష్టించింది. దాదాపు బిలియన్ డాలర్ల విలువను సొంతం చేసుకుంది. ఈ సంస్థ సెకండ్ హ్యాండ్ కార్ల విక్రాయలు జరుపుతుంటుంది. కొవిడ్ వల్ల ఇప్పటి వరకు కార్లు లేనివారు కూడా భద్రతా దృష్ట్యా సొంత వాహనాలపై దృష్టి పెట్టారు. అత్యధికంగా కార్లను కొనుగోలు చేశారు. బైకులు ఉన్నప్పటికీ కార్ల కొనుగోలుకు మొగ్గు చూపారు. పల్లెలతో మొదలు నగరాల వరకు ఇదే తంతు కొనసాగింది. దీంతో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలలో 20 శాతం వృద్ధి సాధించామని సంస్థ సీఈవో విక్రమ్ చోప్రా స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా ఈ సంస్థ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ డీఎస్టీ గ్లోబెల్ దృష్టిని ఆకర్షించింది. దీంతో కంపెనీ విలువ బిలియన్ డాలర్లను దాటిపోయింది. ఈ విషయాన్ని బిజినెస్ అనలటిక్స్ సంస్థ సీబీ ఇన్‌స్టిగేట్స్ తెలిపింది. దీంతో ప్రపంచంలోని 500 యూనికర్న్ కంపెనీల్లో స్థానం సంపాదించింది.