Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 6 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 906752 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 311565 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 571460 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23727 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజస్థాన్‌లో అసమ్మతి వర్గంపై అనర్హత అస్త్రం. స్పీకర్ కి ఫిర్యాదు చేసిన సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం. అనర్హత వేటుకు ప్రక్రియ ప్రారంభం. అసమ్మతి వర్గానికి నోటీసులిచ్చిన స్పీకర్. ఈనెల 17లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం.
  • ఆన్ లైన్ క్లాసులపై మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా తెరుచుకోని విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులపై ఒత్తిడి నర్సరీ చిన్నారులకు 30 నిమిషాల క్లాస్ మాత్రమే ఉండాలన్న కేంద్రం కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్థమైంది. ఇప్పట్లో విద్యాసంస్థలు తెరుచుకునే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ లో పాఠాలను బోధించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. మరోవైపు, గంటల తరబడి మొబైల్ ఫోన్లలో క్లాసులు వింటున్న విద్యార్థులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసుల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
  • అమరావతి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కరోనా వ్యాప్తినిరోధక చర్యలు . పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యాలయానికి ఎవ్వరూ రావద్దని సర్కులర్ జారీ . విభాగాధిపతి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పీఆర్ఆర్డీ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు సిబ్బందికి ఆదేశాలు . ఆదేశాలు జారీ చేసింది ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ .
  • రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు . రుతుపవనాల కు తోడైన రెండు ఉపరితల ఆవర్తనాలు. వాయువ్య బంగాళాఖాతం , గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం -హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు.
  • శ్రీశైలం లో కరోనా కలకలం. ఆలయ ఉద్యోగులకు కూడా కరోనా సోకడంతో ఈరోజు నుంచి వారం రోజుల పాటు భక్తులందరికీ శ్రీశైలం ఆలయ దర్శనం నిలిపివేత. ఇప్పటికే ఎండోమెంట్ కమిషనర్, కర్నూలు కలెక్టర్ తో అనుమతి తీసుకున్న ఈఓ రామారావు.
  • బంజారాహిల్స్ లో 50 కోట్లు విలువైన లాండ్ కేసులో కొత్త కోణం . ఎకరా 20 గుంటలకు చెందినా ల్యాండ్ పత్రాలన్ని నకిలీవి గా తేల్చిన ఏసీబీ.  కోర్ట్ కి అందజేసిన పత్రాలు అన్ని ఫోర్జరీ , నకిలీ గా విచారణ లో వెల్లడి .

గుడ్‌న్యూస్‌.. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు లేకున్నా.. ఏటీఎం నుంచి డబ్బులు..!

Cardless cash withdrawal: Get cash from ATMs without debit.. credit cards, గుడ్‌న్యూస్‌.. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు లేకున్నా.. ఏటీఎం నుంచి డబ్బులు..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా భయపెడుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే 65 లక్షల మార్క్‌ను దాటేసింది. అయితే ఈ క్రమంలో సామాన్య ప్రజలు నిత్యవసరాల విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. కొన్ని చోట్ల సోషల్ డిస్టెన్స్‌తో పాటు.. ఇతరులు టచ్‌ చేసిన చోట ముట్టుకోవాల్సి వస్తుంది. అందులో ఏటీఎం కూడా ఒకటి. అందులో నుంచి డబ్బులు తీసుకోవాలంటే.. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు ఉండాల్సిందే. ఆ కార్డులను మిషన్‌లో పెట్టి.. ఆ తర్వాత పిన్ నంబర్‌ ఎంటర్‌ చేస్తే డబ్బులు బయటకు వస్తాయి. ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు కరోనా కాలంలో బ్యాంకులు కూడా కస్టమర్ల ఆరోగ్యంపై దృష్టి సారించాయి. సాధ్యమైనంత వరకు బ్యాంకు కస్టమర్లకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కార్డ్‌ లేకుండానే నగదు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏటీఎం మిషన్‌ను సాధ్యమైనన్ని తక్కువసార్లు తాకడానికి కార్డ్‌లెస్ ఉపసంహరణ ఎంతో ఉపయోగకంగా ఉంటుందని తెలుస్తోంది. బ్యాంకును బట్టి రోజుకు రూ.10,000 నుండి రూ.20,000 తీసుకోవచ్చు. ఈ సౌకర్యం ప్రస్తుతం కొన్ని బ్యాంకుల్లో ఉంది. ఈ బ్యాంకులు ఇలా నగదు తీసుకునేందుకు పలు యాప్‌లను అందుబాటులో ఉంచాయి. ప్రస్తుతం ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంకు వినియోగదారులు.. ఇలా కార్డ్‌ లెస్ విత్‌ డ్రా చేసుకునేందుకు ఆయా బ్యాంకులకు సంబంధించిన యాప్స్‌ను ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఉదాహరణకు ఎస్బీఐ కోసం యోనో యాప్ డౌన్ లోడ్ చేయాలి. ఆ తర్వాత యాప్‌లో ఉన్నయోనో క్యాష్ ఆప్షన్ ద్వారా ఏటీఎం నుంచి నగదును విత్ డ్రా చేసుకోవచ్చు.

ఇలా కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్స్ చేసే ముందు సదరు బ్యాంకులో ఉన్న సిబ్బందిని అడిగి పూర్తి వివరాలు  తెలుసుకోవడం ద్వారా.. ఎలాంటి ఇబ్బందులు మోసాలకు గురికాకుండా సక్సెస్ ఫుల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.

Related Tags