Breaking News
  • ప్రపంచ దేశాలను కబళిస్తోన్న కరోనా మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా 14.26 లక్షలు దాటిన కరోనా కేసులు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 81,259 మంది మృతి. అమెరికాలో 3,96,757 కరోనా పాజిటివ్‌ కేసులు, 12,758 మంది మృతి. ఇటలీలో 1,35,586 కరోనా పాజిటివ్‌ కేసులు, 17,127 మంది మృతి. స్పెయిన్‌లో 1,40,511 కరోనా పాజిటివ్‌ కేసులు, 13,897 మంది మృతి. ఫ్రాన్స్‌లో 78,167కరోనా పాజిటివ్‌ కేసులు, 8,911 మంది మృతి. యూకేలో 55,242 కరోనా పాజిటివ్‌ కేసులు, 6,159 మంది మృతి. ఇరాన్‌లో 62,589 కరోనా పాజిటివ్‌ కేసులు, 3,872 మంది మృతి. చైనాలో 81,740 కరోనా పాజిటివ్‌ కేసులు, 3,331 మంది మృతి. నెదర్లాండ్స్‌లో 19,580 కరోనా పాజిటివ్‌ కేసులు, 2,101 మంది మృతి. జర్మనీలో 1,06,306 కరోనా పాజిటివ్‌ కేసులు, 1,943 మంది మృతి. బెల్జియంలో 22,194 కరోనా పాజిటివ్‌ కేసులు, 2,035 మంది మృతి. స్విట్జర్లాండ్‌లో 22,245 కరోనా పాజిటివ్‌ కేసులు, 821 మంది మృతి. టర్కీలో 34,109 కరోనా పాజిటివ్‌ కేసులు, 725 మంది మృతి. బ్రెజిల్‌లో 12,345 కరోనా పాజిటివ్‌ కేసులు, 581 మంది మృతి.
  • గుంటూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలుచేయాలి-అంబటి రాంబాబు. ఉ.6 నుంచి 9 గంటల వరకే నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలి. ప్రజలందరూ అధికారుల ఆదేశాలను పాటించాలి. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సహకరించాలి-వైసీపీ నేత అంబటి.
  • లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్న పోలీసులు. బయటకు బండి వస్తే స్వాధీనం చేసుకోనున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. లాక్‌డౌన్‌ సమయంలో చిన్న చిన్న కారణాలతో రోడ్లపైకి వస్తున్నవారిపై.. మరింత కఠినంగా వ్యవహరించనున్న హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. ఎంవీ యాక్ట్‌తో పాటు ఐపీసీ 188 సెక్షన్‌ ప్రకారం.. కేసులు నమోదు చేస్తామంటున్న హైదరాబాద్‌ పోలీసులు.
  • నిజామాబాద్‌ జిల్లాను వణికిస్తున్న కరోనా వైరస్‌. జిల్లాలో 39కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు. నిన్న ఒక్క రోజే 10 పాజిటివ్‌ కేసులు నమోదు. నిజామాబాద్‌ ఉభయ జిల్లాల్లో 13 కంటైన్మెంట్‌ ప్రాంతాలు. 13 ప్రాంతాల్లో ప్రజల దగ్గరకే నిత్యావసర వస్తువుల అందజేత.
  • కడప: పులివెందులలో దారుణం. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం వికటించి గర్భిణి మృతి. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే స్రవంతి మృతిచెందిందని బంధువుల ఆందోళన. పరిస్థితి ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు.

బ్రిడ్జిపై నుంచి కింద పడిన కారు.. ఒకరి మృతి.. పోలీసు కూడా !

Car Accident in Karimnagar, బ్రిడ్జిపై నుంచి కింద పడిన కారు.. ఒకరి మృతి.. పోలీసు కూడా !

కరీంనగర్ పరిధిలోని అల్గునూర్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. కరీంనగర్-హైదరాబాద్ హైవే నుంచి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి మానేరు వంతెనపై నుంచి కింద కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని గండి శ్రీనివాస్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య సునీత తో బాటు మరొకరు గాయపడ్డారు. కాగా-ఈ సంఘటనలో చంద్రశేఖర్ గౌడ్ అనే కానిస్టేబుల్.. తీవ్రంగా గాయపడ్డాడు. బ్రిడ్జిపై నుంచి కారును పరిశీలిస్తున్న ఈయన అదుపుతప్పి కింద పడిపోయాడు.. కాలువలో నీరు  తక్కువగా ఉండడంతో.గాయపడ్డాడని, ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని తెలిసింది. -బాధితులు వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. .

 

 

 

Related Tags