కారులో వేడి తగ్గేందుకు…

Car Coated With, కారులో వేడి తగ్గేందుకు…

దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, వడగాడ్పుల ప్రభావంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులైతే వర్ణనాతీతం. కార్లలో ప్రయాణం చేసేవారికి కూడా ఏసీలు వేసుకున్నా ఉపశమనం పొందలేకపోతున్నారు.

అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ తన ఖరీదైన కారుకు ఆవు పేడ అద్దింది. అద్దాలు, లైట్లు, కంపెనీ లోగో మినహా కారు మొత్తం మందంగా ఆవు పేడ అద్దారు. నగరంలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరిన నేపథ్యంలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఆమె ఈ పని చేసినట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన రూపేశ్‌ గౌరంగదాస్‌ వివరించారు. ‘‘ఆవు పేడను సరైన పద్ధతిలో ఉపయోగించారు. నేనెప్పుడూ ఇలా చూడలేదు. 45 డిగ్రీల ఎండను తట్టుకొనేందుకు ఆమె ఇలా చేశారు.’’ అని పోస్టుకు జత చేశారు. ఈ కారు యజమాని సేజల్‌ షాహ్‌ తనకు తెలుసని వివరించారు. పోస్టును చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *