మరోసారి రక్తసిక్తమైన సిరియా..

సిరియా మరోసారి నెత్తురోడింది. గురువారం జరిగిన కారు బాంబు దాడిలో 11మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో గాయాలపాలైనట్లు బ్రిటన్‌కు చెందిన ఓ మానవహక్కుల సంస్థ ప్రకటించింది. ఉత్తర సిరియా నగరం అఫ్రిన్‌లోని ఓ చెక్‌పాయింట్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చెక్‌ పాయింట్‌ వద్ద వాహనాలు తనిఖీల కోసం నిలిచి ఉండగా.. కారు బాంబు పేలింది. ఏడుగురు పౌరులతో పాటు నలుగురు భద్రతా సిబ్బంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి బాధ్యతవహిస్తున్నట్లు ఏ ఉగ్ర సంస్థా ఇంకా ప్రకటన చేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *