ట్యాంక్‌బండ్ పై కారు బోల్తా తప్పిన ముప్పు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వ‌ద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికి పెద్దగా గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ట్యాంక్‌బండ్ పై కారు బోల్తా తప్పిన ముప్పు
Follow us

|

Updated on: Oct 10, 2020 | 3:16 PM

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వ‌ద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికి పెద్దగా గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎన్టీఆర్ మార్గ్‌లో వేగంగా వ‌చ్చిన ఓ కారు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదం నుంచి కారులో ప్ర‌యాణిస్తున్న వ్య‌క్తులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. అందులో ప్రయాణిస్తున్నవారు స్థానికుల సాయంతో సల్పగాయాలతో సురక్షితంగా వెలుపలికి వచ్చారు. దీంతో ఘ‌ట‌నాస్థ‌లంలో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ స‌హాయంతో కారును రోడ్డు ప‌క్క‌కు లాగారు. ఈ ప్ర‌మాదానికి అతి వేగ‌మే కార‌ణ‌మ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.