రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. దేశ రాజధానిపై చలి పంజా విసురుతోంది..

ఢిల్లీలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. తాజాగా 7 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగజరాయి. గత 17 ఏళ్లలో నమోదు కాని ఉష్ణోగ్రతలు ఈ నవంబర్‌లో నమోదవుతున్నాయి. చలి పులితో ఢిల్లీ వాసులు గజగజ వణుకుతున్నారు.

  • Sanjay Kasula
  • Publish Date - 9:17 pm, Sun, 22 November 20

Delhi Colder Winter : ఢిల్లీలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. తాజాగా 7 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగజరాయి. గత 17 ఏళ్లలో నమోదు కాని ఉష్ణోగ్రతలు ఈ నవంబర్‌లో నమోదవుతున్నాయి. చలి పులితో ఢిల్లీ వాసులు గజగజ వణుకుతున్నారు. జనాలు బయటకు రావాలంటేనే జంకే పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా రెండోరోజు చల్లగాలులు వీస్తుండడంతో ఉత్తరభారతంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయానని వాతావరణ శాఖ తెలిపింది.

ఆదివారం ఉద‌యం 6.9 డిగ్రీల సెల్సియ‌స్‌కు ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయాయి. చివ‌రిసారి 2003, న‌వంబ‌ర్‌లో అత్య‌ల్పంగా 6.1 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. మ‌రోవైపు రాజ‌ధానిలో కాలుష్యం కూడా పెరిగిపోతూనే ఉంది. గాలి నాణ్య‌త‌ను సూచించే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆదివారం 259గా న‌మోదైంది.

డిసెంబర్‌ నెలలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఢిల్లీ ఇప్పుడే చూస్తోంది. డే టెంపరేచర్‌ 12.2 డిగ్రీలకు పడిపోయింది. ఆదివారం ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. గ్రేటర్‌ నొయిడా, గజియాబాద్‌ ఏరియాల్లో పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.