ఇంకా తెగని ‘ మహా ‘ పంచాయితీ.. సేన-బీజేపీ మధ్య మొదలైన మాటల యుధ్ధం

మహారాష్ట్రలో అధికార పంపిణీపై బీజేపీ-శివసేన మధ్య ఇప్పటికీ సయోధ్య కుదరకపోగా.. ‘ పంచాయితీ ‘ మరింత ముదిరింది. శుక్రవారం తన పదవికి రాజీనామా చేసిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. చర్చల వైఫల్యానికి శివసేనే కారణమని ఆరోపించారు. ఆ పార్టీ వల్లే రాష్ట్రంలో సేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడలేకపోయిందన్నారు. ఆ సందర్భంగా ఆయన తనపట్ల చేసిన వ్యాఖ్యలను సేన చీఫ్ ఉధ్ధవ్ థాక్రే ఖండించారు. తనను ‘ అబధ్ధాలకోరు ‘ అంటూ ఆయన విమర్శించారని, అయితే అబధ్ధాలు చెప్పే […]

ఇంకా తెగని '  మహా ' పంచాయితీ.. సేన-బీజేపీ మధ్య మొదలైన మాటల యుధ్ధం
Follow us

|

Updated on: Nov 09, 2019 | 2:10 PM

మహారాష్ట్రలో అధికార పంపిణీపై బీజేపీ-శివసేన మధ్య ఇప్పటికీ సయోధ్య కుదరకపోగా.. ‘ పంచాయితీ ‘ మరింత ముదిరింది. శుక్రవారం తన పదవికి రాజీనామా చేసిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. చర్చల వైఫల్యానికి శివసేనే కారణమని ఆరోపించారు. ఆ పార్టీ వల్లే రాష్ట్రంలో సేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడలేకపోయిందన్నారు. ఆ సందర్భంగా ఆయన తనపట్ల చేసిన వ్యాఖ్యలను సేన చీఫ్ ఉధ్ధవ్ థాక్రే ఖండించారు. తనను ‘ అబధ్ధాలకోరు ‘ అంటూ ఆయన విమర్శించారని, అయితే అబధ్ధాలు చెప్పే అలవాటు తనకు లేదని అన్నారు. నిజానికి 50 : 50 ఫార్ములా పై లోక్ సభ ఎన్నికలముందు బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా, ఫడ్నవీస్ లే తన వద్ద ప్రస్తావన తెచ్చారని, వారే తనవద్దకు వచ్చారు తప్ప తానేమీ వారివద్దకు వెళ్లలేదని ఉధ్ధవ్ పేర్కొన్నారు. వాళ్ళే మొదట అంగీకరించి.. ఆ తరువాత కాదనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మా డిమాండును వారు ఒప్పుకునేంతవరకు వారితో మాట్లాడే ప్రసక్తే లేదు అన్నారాయన.

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ.. ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడలేదా అన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత త్వరగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో చూస్తా అంటూ ఆయన బీజేపీని సవాల్ చేశారు. ప్రతిపార్టీకీ తన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు ఉంటుందని ఆయన చెప్పారు. ‘ మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు కమలనాథులు యత్నిస్తున్నారు.. అందువల్లే ఇటీవల వారిని ముంబైలోని ఓ హోటల్ కు తరలించాం ‘ అని ఉధ్ధవ్ అన్నారు. సీఎం పదవిపై తమ డిమాండును వదులుకునే ప్రసక్తే లేదని, నా తండ్రి దివంగత బాల్ థాక్రే కి గతంలో నేనిదే హామీ ఇచ్చానని ఆయన గుర్తు చేశారు. ఇలా ఉండగా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించిందో దానినే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ మళ్ళీ కోరారు. మరోవైపు.. సర్కార్ ను ఏర్పాటు చేయవలసిందిగా బీజేపీని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కోరే అవకాశాలున్నాయని అంటున్నారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!