Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు, 425 మంది మృతి. దేశవ్యాప్తంగా 6,97,413 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,53,287 యాక్టీవ్ కేసులు,4,24,433 మంది డిశ్చార్జ్. దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • హైదరాబాద్‌లో లాలాపేట పరిధిలో సాధారణ ఇంటికి రూ.25 లక్షల కరెంట్ బిల్లు. మార్చి 6 నుంచి జులై 6 వరకు బిల్లు తీశారు. ఈ నాలుగు నెలల్లో 34,5007 యూనిట్లు విద్యుత్ వాడినట్లు చూపించి.. ఏకంగా రూ. 25,11,467 బిల్లు వేశారు.
  • అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు లో పిటిషన్. పిటిషన్ దాఖలు చేసిన అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు అయిన అచ్చెన్నాయుడు . ప్రస్తుతం విజయవాడలో జైల్లో ఉన్న అచ్చెన్నాయుడు. వెంటనే బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరిన న్యాయవాది. ఇప్పటికే ఏసీబీ కస్టడీ కూడా ముగిసిందని పిటిషన్ లో పేర్కొన్న న్యాయవాది. ఏసీబీ కోర్టు బెయిల్ పిటీషన్ ను సస్పెండ్ చేయడంతో హైకోర్టు ను ఆశ్రయుంచిన అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు.
  • హైదరాబాద్ కమిషనరేట్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017 సంవత్సరంలో జరిగిన మైనర్ రేప్ కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైల్ శిక్ష విధించిన కోర్టు.
  • కృష్ణజిల్లా: మచిలీపట్నం సబ్ జైలు నుంచి కొల్లు రవీంద్రను రాజమండ్రి తరలింపు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు న్యాయమూర్తి అనుమతి. గత రెండురోజులుగా మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న కొల్లు రవీంద్ర. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి కొల్లు. అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ నేతలు నిరసన. సబ్ జైలుకు చేరుకుని నల్ల బ్యార్జ్ లతో నిరసన. భారీ బందోబస్తు తో కొల్లు రవీంద్ర ను తరలించిన పోలీసులు.
  • రానున్న బక్రీద్ కు కుర్భాని చేసే పరిస్థితి లేదు కాబట్టి బక్రీద్ పర్వదినం రోజు ఎవరు జంతువులను కోయరాదు. కుర్భాని డబ్బులను కరోనా సమయంలో ఎవరికి అవసరం ఉంటుందో వారికి ఉపయోగించగలరు. ఫత్వా జారీ చేసిన జమియా నిజామియా ముస్లిం మత పెద్దలు.

ఉత్తర భారత యువతలో స్కిల్స్ లేవు..కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Enough jobs; but candidates from North-India lack skills: BJP leader, ఉత్తర భారత యువతలో స్కిల్స్ లేవు..కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

నిరుద్యోగంపై కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకున్నాయి. శనివారం ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘దేశంలో ఉద్యోగాలకు కొదవలేదు. కానీ వాటి కోసం దరఖాస్తు చేసుకుంటున్న ఉత్తర భారతానికి చెందిన అభ్యర్థుల్లో తగిన నైపుణ్యాలు ఉండటం లేవు’ అని పేర్కొన్నారు. గాంగ్వర్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకులు దీటుగా స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి క్షమాపణలు చెప్పాలంటూ పలువురు నాయకులు డిమాండు చేశారు.

దీనిపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. ‘ఉద్యోగాలను కల్పించడంలో కేంద్రాన్ని విఫలమైంది. మంత్రిగారూ.. మీరు ఐదేళ్లుగా అధికారంలో ఉన్నారు. ఈ ఐదేళ్లలో మీరు కొత్త ఉద్యోగాలు సృష్టించలేదు. అంతేకాకుండా ఆర్థిక మందగమనం కారణంగా ఉన్న ఉద్యోగాలను సైతం పోయేలా చేశారు. ప్రభుత్వం మాకోసం ఏవైనా మంచి నిర్ణయాలు తీసుకుంటుందని దేశంలో ఉన్న నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నారు. కానీ మీరు మాత్రం ఉత్తర భారతదేశానికి చెందిన వారిని అవమానించి తప్పించుకోవాలని చూస్తున్నారు’ అని ఆమె విమర్శించారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘దేశం ఆర్థిక ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

Related Tags