అక్కడ.. 6 అడుగుల దూరం పాటించకపోతే.. 2 లక్షలు కట్టాల్సిందే..!

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్ని చిగురుటాకులా వణికిపోతున్నాయి. దీని నియంత్రణకు పలు దేశాలు లాక్‌డౌన్‌లు విధించి, కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇళ్లలో ఉండేవారు కూడా తగు జాగ్రత్తలు

అక్కడ.. 6 అడుగుల దూరం పాటించకపోతే.. 2 లక్షలు కట్టాల్సిందే..!
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 5:30 PM

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్ని చిగురుటాకులా వణికిపోతున్నాయి. దీని నియంత్రణకు పలు దేశాలు లాక్‌డౌన్‌లు విధించి, కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇళ్లలో ఉండేవారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కెనడాలోని టొరంటో నగర మేయర్ సూచించారు. కొంతమంది కావాలనే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాగా.. కరోనా కట్టడి చేయాలంటే ఇటువంటి వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే విధంగా ఒకే కుటుంబంలోని వారైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం 6 అడుగుల దూరం పాటించాలని చెప్పారు. ఒకవేళ ఈ నిబంధన ఉల్లంఘిస్తే వారికి 3500 డాలర్లు జరిమానా విధిస్తానని స్పష్టంచేశారు. కాగా, కెనడాలో ఇప్పటికే ఈ వైరస్ కారణంగా173 మంది మరణించారు.