హాంకాంగ్ తో అప్పగింత ఒప్పందం రద్దు.. కెనడా

హాంకాంగ్ పై చైనా తెచ్చిన జాతీయ భద్రతా చట్టానికి నిరసనగా కెనడా అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే  మిలిటరీ, ఇతర సాధనాల ఎగుమతిని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 'ఒకే దేశం-రెండు విధానాలు'..

హాంకాంగ్ తో అప్పగింత ఒప్పందం రద్దు.. కెనడా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 04, 2020 | 6:31 PM

హాంకాంగ్ పై చైనా తెచ్చిన జాతీయ భద్రతా చట్టానికి నిరసనగా కెనడా అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే  మిలిటరీ, ఇతర సాధనాల ఎగుమతిని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ‘ఒకే దేశం-రెండు విధానాలు’ అన్న విధానాన్ని తాము పాటిస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. 1997 లో బ్రిటన్ హాంకాంగ్ ని తిరిగి అప్పగించినప్పుడు పాటించిన సెమి అటానమస్ విధానాన్ని ఆయన ప్రస్తావించారు. హాంకాంగ్ లో సుమారు మూడు లక్షల మంది కెనడియన్లు ఉన్నారని, వారి భద్రత తమకు ముఖ్యమని ఆయన చెప్పారు. కెనడా, చైనా మధ్య సంబంధాలు కొంత ఉద్రిక్తంగా ఉన్నాయి. చైనాకు చెందిన హువే సంస్థ ఎగ్జిక్యూటివ్.. మెంగ్ వాంగ్ చూ.ను ఓ కేసులో అనుమానితునిగా పేర్కొంటూ అమెరికా అతడిపై ఆంక్షలు విధించింది.  తమ దేశంలో తలదాచుకున్న అతడిని అమెరికా అభ్యర్థనపై కెనడా పోలీసులు  2018 డిసెంబరులో అరెస్టు చేశారు. అదే సమయంలో గూఢ చర్యం ఆరోపణలపై ఇద్దరు కెనడియన్లను చైనా అరెస్టు చేయడంతో ఉభయ దేశాల సంబంధాలు దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ ప్రకటన చేశారు.