గాడ్సే దేశభక్తుడా? సాధ్విని క్షమించబోమన్న మోదీ

PM Modi Responce on Sadhvi Pragya Comments, గాడ్సే దేశభక్తుడా? సాధ్విని క్షమించబోమన్న మోదీ

ఎన్నికల వేళ ప్రధాని నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ అభ్యర్థిపై విరుచుకుపడ్డారు. కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు మోదీ షాక్ ఇచ్చారు. గాడ్సేపై ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. గాడ్సే గొప్ప దేశభక్తుడు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మహాత్మాగాంధీని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఆమెను క్షమించేది లేదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అదే విధంగా ఈ ఎన్నికల్లో ఎన్డీయే 300 పైగా సీట్లు సాధిస్తుందని అన్నారు.

కాగా తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు గానూ సాద్వీ ప్రగ్యా సింగ్ తన మద్దతుదారుల చేత క్షమాపణ చెప్పించి ‘మమ’ అనిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *