Breaking News
  • నిజామాబాద్‌లో హైఅలర్ట్. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిన్న ఒక్క రోజే 26 కేసులు. పాజిటివ్‌ వచ్చినవారి బంధువులను గుర్తించే పనిలో అధికారులు.
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 కేసులు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో 144 సెక్షన్‌. పాజిటివ్‌ ప్రాంతాల్లోని వాసులకు హోంక్వారంటైన్‌. రక్త నమూనాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.
  • గుజరాత్: సురేంద్రనగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి, మరొకరికి గాయాలు. హైదరాబాద్-70, వరంగల్‌ అర్బన్-19, కరీంనగర్-17 కేసులు. మేడ్చల్-15, రంగారెడ్డి-16, నిజామాబాద్-16, నల్గొండ-9. కామారెడ్డి-8, మహబూబ్‌నగర్-7, గద్వాల-6, సంగారెడ్డి-6. మెదక్-4, భద్రాద్రి-కొత్తగూడెం-4 కేసులు. ములుగు-2, భూపాలపల్లి-1, జనగామ-1 కేసులు నమోదు.
  • రాజస్థాన్: ఈరోజు కొత్తగా 12 పాజిటివ్‌ కేసులు నమోదు. మొత్తం 191 కేసులు నమోదు.
  • ఏపీ, తెలంగాణలో రేషన్‌ పరేషాన్. రేషన్‌ షాప్‌ల దగ్గర భారీగా క్యూ కట్టిన జనం. మెజారిటీ షాప్‌ల దగ్గర కనిపంచిన భౌతికదూరం నిబంధన. పంపిణీలో జాప్యంపై నిర్వాహకులతో జనం ఘర్షణ. రంగంలోకి దిగిన పోలీసులు. రేషన్‌ షాప్‌ల దగ్గర భౌతిక దూరం పాటించేలా చర్యలు. కార్డు దారులందరికీ ఉచిత బియ్యం అందిస్తామంటున్న అధికారులు.

హైదరాబాద్‌లో ఒంటెపాల క్రేజ్..‘ఆ‘ పవర్ కోసమే!

camel milk crazy in hyderabad, హైదరాబాద్‌లో ఒంటెపాల క్రేజ్..‘ఆ‘ పవర్ కోసమే!

హైదరాబాద్ నగరాన్ని ఒంటెపాల క్రేజ్ కమ్మేస్తోంది. ఒంటెపాలు తాగితే పుంసత్వం పెరుగుతుందన్న ప్రచారం జోరందుకోవడంతో లీటర్ పాల కోసం 500 రూపాయలు వెచ్చించేందుకు కూడా జనం వెనుకాడడం లేదు. పుంసత్వం పెరగడంతోపాటు బరువు తగ్గేందుకు కూడా ఒంటెపాలు పనికొస్తాయని చెబుతున్నారు. దాంతో ఒంటెపాల డిమాండ్ మరింతగా పెరుగుతోంది.

ఒంటెపాలకు డిమాండ్ బాగా పెరిగిపోవడంతో ఏకంగా జైపూర్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సిటీలో నెలకు దాదాపు 3వేల లీటర్లు వరకు ఒంటెపాలు అమ్ముడవుతున్నట్టు చెబుతున్నారు. లీటర్ బాటిల్ నుంచి చిన్న చిన్న బాటిల్స్‌లో 200 మిల్లీ లీటర్లు కూడా అమ్ముతున్నామని, మంచి రెస్పాన్స్‌ వస్తోందని చెబుతున్నారు. ఒంటెపాల వినియోగదారుల్లో అన్ని వర్గాల వారు ఉన్నారంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్లు, జిమ్‌లో వర్కవుట్‌ చేసేవాళ్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు.

చాలా రోజుల నుంచి ఒంటెపాలు తాగుతున్నవాళ్లు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఈ పాలు పిల్లలకు బలాన్ని ఇస్తాయని, అలాగే చురుకుదనాన్ని పెంచుతాయని అంటున్నారు. ధర కొంచెం ఎక్కువైనా, రుచి కొంచెం ఉప్పగా ఉన్నా కొంటున్నామని వినియోగదారులు చెబుతున్నారు.

అయితే డాక్టర్ల వెర్షన్‌ వేరే విధంగా ఉంది. కామెల్‌ మిల్క్‌ తాగటం వల్ల ప్రత్యేకంగా ఒనగూడే లాభనష్టాలు ఏమీ లేవంటున్నారు. పుంసత్వం పెరగటం, షుగర్‌ తగ్గటం అంతా భ్రమ అంటున్నారు
జనం మాత్రం రకరకాల నమ్మకాలతో ఒంటెపాలు కొంటున్నారు. డాక్టర్లు చెప్పేదానితో నిమిత్తం లేకుండా వేలంవెర్రిగా తాగుతున్నారు.

Related Tags