ఇక్కడ క్లాసుల్లో పాఠాలు చెప్పేది లేదంటున్న టీచర్లు..!

కరోనా దెబ్బకి విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. ఏడాది మొత్తం విద్యా సంస్థలకు వెళ్లి చదివే పరిస్థితే లేకుండా పోతోంది. ఇకపై ఆన్‌లైన్‌ పాఠాలంటే అంతే సంగతులు. కొవిడ్ 19 దెబ్బకి బడిలో పాఠాలు చెప్పేదే లేదంటున్నారు బ్రిటన్ కి చెందిన అధ్యాపకులు. లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా మధ్యలో ఆగిపోయిన పాఠాలను ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తున్నాయి విద్యాసంస్థలు. బ్రిటన్ కి చెందిన ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఇంతకాలం […]

ఇక్కడ క్లాసుల్లో పాఠాలు చెప్పేది లేదంటున్న టీచర్లు..!
Follow us

| Edited By:

Updated on: May 21, 2020 | 6:49 AM

కరోనా దెబ్బకి విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. ఏడాది మొత్తం విద్యా సంస్థలకు వెళ్లి చదివే పరిస్థితే లేకుండా పోతోంది. ఇకపై ఆన్‌లైన్‌ పాఠాలంటే అంతే సంగతులు. కొవిడ్ 19 దెబ్బకి బడిలో పాఠాలు చెప్పేదే లేదంటున్నారు బ్రిటన్ కి చెందిన అధ్యాపకులు. లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా మధ్యలో ఆగిపోయిన పాఠాలను ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తున్నాయి విద్యాసంస్థలు. బ్రిటన్ కి చెందిన ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఇంతకాలం ఆన్‌లైన్‌ టీచింగ్ తో పాఠాలు చెబుతూవచ్చారు. కానీ, అక్టోబర్ లో ఆరంభమయ్యే వచ్చే విద్యాసంవత్సరంలో కూడా ఫేస్ టూ ఫేస్ క్లాసులకు ససేమిరా అంటున్నారు. ఇకపై అన్ని తరగతులను ఆన్‌లైన్‌, వర్చుల్ ద్వారానే నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు వర్సిటీ అధికారులు.

బ్రిటన్ లో కరోనా వైరస్ విజృభిస్తోంది. వేలాది మంది మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు అధికారుులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గిన తర్వాత పాఠశాలల్లో బోధన కొనసాగించేలా, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తామంటున్నారు. కరోనా వైరస్‌ ఇప్పటికే విద్యార్థి జీవితాలను నాశనం చేసింది. దీంతో మార్చి నెల నుంచే ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా, పరీక్షలను రిమోట్‌గా నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.