కాలిఫోర్నియాలో ఘోర పడవ ప్రమాదం

California boat fire: 34 missing after diving boat fire near Santa Cruz Island, కాలిఫోర్నియాలో ఘోర పడవ ప్రమాదం

కాలిఫోర్నియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. శాంటాక్రూజ్ దీవి సమీప తీర ప్రాంతంలో ఓ పడవ అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘటనలో 34 మంది ప్రయాణికులు గల్లంతైనట్లుగా అమెరికా కోస్టల్ సెక్యురిటీ టీం వెల్లడించింది. తీరానికి కొద్ది దూరంలో స్కూబా డైవ్‌ చేసే వాణిజ్య పడవలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన తీరంలోని గస్తీదళం.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆ పడవ పూర్తిగా కాలిపోయింది. అందులో నుంచి అయిదుగురిని రక్షించామని.. మిగతా 34 మంది ఆచూకి తెలియరాలేదని రెస్క్యూ టీం తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుఝామున 3.28 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. పడవలో మొత్తం ఎంతమంది ఉన్నారనే అంశంపై ఇంకా స్పష్టత లేదని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *