Breaking News
  • భారత్-చైనా సరిహద్దుల్లోని డోక్లాంలో మళ్లీ అలజడి. 2 శక్తివంతమైన సర్వైలెన్స్ కెమేరాలను ఏర్పాటు చేసిన చైనా. వివాదాస్పద స్థలానికి దారితీసే రోడ్డు రిపేర్. 2017లో 73 రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు. లద్దాఖ్ ఉద్రిక్తతల మళ్లీ కుట్రలు పన్నుతున్న చైనా.
  • తూర్పు గోదావరి జిల్లా: కాకినాడ లొంగిపోయిన మావోలు. కాకినాడ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులు. లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులు పేర్లు కొవ్వాసి సునీత. కలుమ మనోజ్ . లొంగిపోయిన మావోయిస్టులకు 5 వేల ఆర్థిక సహాయం చేసిన జిల్లా ఎస్పీ.
  • అమరావతి: మాజీ మంత్రి అచ్చం నాయుడు కు కరోనా పాజిటివ్. కోర్టు ఆదేశాలతో గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు హైకోర్టుకు లేఖ రాసిన గుంటూరు రమేష్ హాస్పటల్. అచ్చెన్నాయుడు కు కరోనా పాజిటివ్ అని లేఖలో హైకోర్టు కు తెలిపిన రమేష్ హాస్పిటల్స్. రెండు రోజులుగా జలుబుతో బాధపడుతున్నఅచ్చెన్నాయుడు ఈ నేపథ్యంలోనే కరోనా టెస్ట్ చేసిన ఆస్పత్రి సిబ్బంది.
  • చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం ఫై బులెటిన్ విడుదల చేసిన వైద్యులు. కరోనా వైరస్ నిర్ధారణ కావడం తో ఆస్పత్రిలో చేరిన ఎస్పీ బాలసుబ్రమణ్యం . ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం మెరుగ్గా ఉంది . శరీరం లో ఆక్సిజన్ లెవల్స్ నిలకడగా ఉన్నాయ్ . వైద్యుల పర్యవేక్షణలో మెరుగయిన వైద్య చికిత్స అందిస్తునాం.
  • విజయవాడ : రమేష్ హాస్పిటల్ లీలలు. ఒక్కొక్కటిగా రమేష్ హాస్పిటల్ అక్రమాలు. నాలుగురోజుల గా పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు. స్వర్ణ ప్యాలెస్ లో మే 18 న కోవిడ్ కేర్ సెంటర్ కు అనుమతి కోరిన రమేష్ హాస్పిటల్ యాజమాన్యం . కాని మే 15 నుంచే స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ను నిర్వహిస్తున్న రమేష్ హాస్పిటల్‌. నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రాంతాలలో కోవిడ్ కేర్ సెంటర్లకు నిర్వహణ. స్వర్ణా ప్యాలెస్‌ లో అగ్ని ‌ప్రమాదంతో బయటపడ్డ అక్రమాలు.
  • అమరావతి: ‘దిశ’ చట్టం అమలుపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ సహా అధికారులు హాజరు.
  • కృష్ణ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల రానున్న రెండు రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జిల్లా లోని అన్ని మండలాలలో గల లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా యంత్రాంగం.

వీసా పాలసీ.. ట్రంప్ ప్రభుత్వంపై కోర్టుకెక్కనున్న కాలిఫోర్నియా

విద్యార్థులకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వీసా పాలసీపై కోర్టుకెక్కాలని కాలిఫోర్నియా రాష్ట్రం నిర్ణయించింది. ఆన్ లైన్ ద్వారా తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులు అమెరికాలోనే ఉన్న పక్షంలో..
Trump Administration Over Student Visa Policy, వీసా పాలసీ.. ట్రంప్ ప్రభుత్వంపై కోర్టుకెక్కనున్న కాలిఫోర్నియా

విద్యార్థులకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వీసా పాలసీపై కోర్టుకెక్కాలని కాలిఫోర్నియా రాష్ట్రం నిర్ణయించింది. ఆన్ లైన్ ద్వారా తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులు అమెరికాలోనే ఉన్న పక్షంలో.. వారి వీసాలను రద్దు చేస్తామనో, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనో ట్రంప్ ప్రభుత్వం ఇటీవల హెచ్చరించింది. అయితే దీన్ని సవాలు చేస్తూ.. తాము డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేస్తామని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బెసెరా తెలిపారు. ఈ కొత్త వీసా పాలసీకి వ్యతిరేకంగా ప్రిలిమినరీ ఇంజంక్షన్ జారీ చేయాలని  తాము కోరనున్నామన్నారు. వచ్ఛే గురువారం ఈ దావా వేస్తామని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని రాష్టాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి  రాష్ట్రం కాలిఫోర్నియాయే అయింది. ఎఫ్-1, ఎం-1 వీసాలపై ఆన్ లైన్ తరగతులకు హాజరవుతున్న స్టూడెంట్స్ కరోనా వైరస్ నేపథ్యంలో ఇక తమ దేశం విడిచి వెళ్లాలని ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం వార్నింగ్ ఇచ్చింది. ఈ రూల్స్ ని అతిక్రమించిన పక్షంలో చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొంది. అయితే  ఈ నిర్ణయం నిరంకుశమైనదిగా, అక్రమమైనదిగా ఉందని జేవియర్ బెసెరా ఆరోపించారు.

 

 

Related Tags