కాఫీ డే ఓనర్ సిధ్ధార్థను వెన్నాడిన కష్టాలు.. ఒత్తిడి భరించలేక…

పాపులర్ ఛైన్ కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ అల్లుడు వి.జి. సిధ్ధార్థ మంగుళూరులోని బ్రిడ్జి వద్ద నుంచి అదృశ్యమైన ఘటన సంచలనమైంది. అంతకుముందు ఆయన.. తన సంస్థ యాజమాన్యానికి, ఉద్యోగులకు రాసిన పెద్ద లేఖ వారికి షాకిచ్చింది. సరైన లాభాలు లేని బిజినెస్ లో సాగుతున్నానని, ఓ సీనియర్ ఆదాయంపన్ను అధికారి తనను వేధిస్తున్నారని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ‘ బిజినెస్ మోడల్ గా రాణించడానికి నేను చేసిన ప్రయత్నాలు […]

కాఫీ డే ఓనర్ సిధ్ధార్థను వెన్నాడిన కష్టాలు.. ఒత్తిడి భరించలేక...
Follow us

|

Updated on: Jul 30, 2019 | 12:20 PM

పాపులర్ ఛైన్ కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ అల్లుడు వి.జి. సిధ్ధార్థ మంగుళూరులోని బ్రిడ్జి వద్ద నుంచి అదృశ్యమైన ఘటన సంచలనమైంది. అంతకుముందు ఆయన.. తన సంస్థ యాజమాన్యానికి, ఉద్యోగులకు రాసిన పెద్ద లేఖ వారికి షాకిచ్చింది. సరైన లాభాలు లేని బిజినెస్ లో సాగుతున్నానని, ఓ సీనియర్ ఆదాయంపన్ను అధికారి తనను వేధిస్తున్నారని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ‘ బిజినెస్ మోడల్ గా రాణించడానికి నేను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నా మీద నమ్మకం ఉంచినవారి ఆశలను వమ్ము చేసినందుకు చింతిస్తున్నా.. ఎంతోకాలంగా పోరాడా.. కానీ ఈ రోజు అన్నింటినీ వదిలేసుకున్నా.. ఇక ఒత్తిడిని భరించే శక్తి నాకు లేదు ‘ అని సిధ్ధార్థ అన్నారు. ప్రయివేట్ ఈక్విటీ పార్ట్ నర్లలో ఒకరు బై బ్యాక్ షేర్ల విషయంలో తననెంతో ఒత్తిడికి గురి చేశారని, ఆరు నెలల క్రితం ఓ ఫ్రెండ్ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నానని, అదే సమయంలో అప్పులిచ్చినవారు తనను వేధించడం ప్రారంభించారని ఆయన తెలిపారు. ‘ మైండ్ ట్రీ ‘ కన్సల్టెంట్ సంస్థతో నేను కుదుర్చుకున్న డీల్ ను అడ్డుకోవడానికి రెండు సందర్భాల్లో నా షేర్లను అటాచ్ చేసిన వ్యవహారంలో ఆదాయం పన్ను మాజీ డీజీ నుంచి కూడా నేను వేధింపులను ఎదుర్కోవాల్సివచ్చింది అని సిధ్ధార్థ పేర్కొన్నారు. మా కాఫీ డే షేర్లను వాళ్ళు హస్తగతం చేసుకోవడంతో తీవ్రమైన లిక్విడిటీ క్రంచ్ తప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బెంగుళూరుకు సుమారు 350 కి.మీ. దూరంలోని మంగుళూరులో నేత్రావతి నది వంతెనపై చివరిసారి సిద్దార్థ కనిపించారు. ఒక కిలోమీటర్ పొడవునా ఉన్న ఈ బ్రిడ్జి సమీపంలోను, ఆ చుట్టుపక్కల పోలీసులు విస్తృత గాలింపు జరిపారు. చివరకు బురదనీటితో నిండిన ఈ నదిలోనూ గజఈతగాళ్ళు సెర్చ్ చేశారు. ఈ బ్రిడ్జి చివరలో కారు ఆపాలని సిధ్ధార్థ తనను కోరారని, అక్కడే కొంతసేపు వేచి చూడాలన్నారని, కానీ కొద్దిసేపటికే ఆయన కనిపించలేదని ఆయన కారు డ్రైవర్ తెలిపాడు.

ఈ ఏడాది మార్చిలో మైండ్ ట్రీ సంస్థలోని తన 20 శాతం ఈక్విటీ షేర్లను లార్సెన్ అండ్ టౌబ్రో ఇంజనీరింగ్ సంస్థకు సిధ్దార్థ రూ. 3,300 కోట్లకు అమ్మారని తెలిసింది. అలాగే తన కాఫీ డే సంస్థను కోకా-కోలాకు అమ్మడానికి ఆయన చర్చలు జరిపారని తెలిసినట్టు రాయిటర్ వార్తా సంస్థ వెల్లడించింది. 2017 సెప్టెంబరులో ఇన్ కమ్ టాక్స్ అధికారులు సిద్దార్థ కార్యాలయాలపై దాడులు జరిపారు. ఆయన కుటుంబం 130 ఏళ్లుగా కాఫీ గ్రోయింగ్ బిజినెస్ నిర్వహిస్తోంది. దేశంలోని బడా కాఫీ బీన్స్ ఎగుమతిదారుల్లో సిధ్ధార్థ ఒకరు.