మాజీ సీఎం అల్లుడు.. కాఫీ డే ఫౌండర్ మిస్సింగ్..

కాఫీ డే ఫౌండర్, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ సోమవారం సాయంత్రం అదృశ్యమయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు కారులో వెళుతున్న సమయంలో వీజీ సిద్ధార్థ నేత్రావతి నది వంతెన రాగానే కారు ఆపారు. నది ఒడ్డున డ్రైవరును కారు ఆపమని చెప్పి దిగి నదివైపు.. వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో కంగారు పడ్డ డ్రైవర్ కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. సిద్దార్థ మిస్సింగ్ పై దక్షిణ కన్నడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్థు చేపట్టారు. నదిలో గాలించినా సిద్ధార్థ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.

కారు నుంచి దిగి వెళ్లిపోయిన సమయంలో… సిద్దార్థ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నారని డ్రైవర్ తెలిపాడు. సిద్దార్థ మిస్సింగ్ వార్త క్షణాల్లో కర్ణాటక అంతటా వ్యాపించింది. దీంతో ఎస్ఎం కృష్ణ ఇంటికి సిద్దార్థ బంధువులు,స్నేహితులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ ఇటీవల బీజేపీలో చేరారు. దేశంలోనే అతిపెద్ద కేఫ్ కాఫీ డే సంస్థతో పాటు సిద్ధార్థ హాటల్ బిజినెస్ కూడా చేస్తున్నారు. 1990లో మొదటిసారి బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్‌లో కేఫ్ కాఫీ డేను ఏర్పాటు చేశారు. అతి కొద్ద కాలంలోనే అది ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 10వేల మంది ఉద్యోగులు ప్రస్తుతం ఆయన సంస్థలో పనిచేస్తున్నారు. అంతేకాదు స్వచ్చంద కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటూ వస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *