మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లు..కేబినెట్ గ్రీన్ సిగ్నల్

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించిన చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్ లా (సవరణ) చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019 బిల్లుపై బుధవారం సుదీర్ఘంగా చర్చించిన ఆంధప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా బిల్లు చట్టంగా మారితే.. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి మరణ శిక్ష విధిస్తారు. అత్యాచారాన్ని నిర్ధారించే ఆధారాలు లభ్యమైతే […]

మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లు..కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Follow us

|

Updated on: Dec 11, 2019 | 4:42 PM

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించిన చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్ లా (సవరణ) చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019 బిల్లుపై బుధవారం సుదీర్ఘంగా చర్చించిన ఆంధప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తాజా బిల్లు చట్టంగా మారితే.. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి మరణ శిక్ష విధిస్తారు. అత్యాచారాన్ని నిర్ధారించే ఆధారాలు లభ్యమైతే కేవలం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చట్టంలో మార్పులు తీసుకువస్తున్నారు. వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, మరో 14 రోజుల్లో విచారణ జరిపించాల్సి వుంటుంది. అంటే మొత్తం 21 రోజుల్లో జడ్జిమెంట్‌ వచ్చేలా చట్టంలో మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతమున్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు తీసుకువస్తున్నారు.

మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు వంటి నేరాలకు విచారణ కోసం ప్రతిజిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం తీర్మానించింది. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగులు పెడితే చర్యలను ఖాయం చేస్తోంది కొత్త బిల్లు. సంబంధిత చట్టంలో తాజాగా చేస్తున్న మార్పుల ప్రకారం మెయిల్, సోషల్‌మీడియా, డిజిటిల్‌ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే సెక్షన్‌ 354 (ఇ) కింద మొదటి సారి తప్పు చేస్తే 2 సంవత్సరాలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు.

పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్‌) కింద చర్యలు తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశారు. పోక్సో చట్టం కింద ఇప్పటి వరకు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తుండగా దాన్ని మరింత పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.