రాజధానిపై జగన్ నిర్ణయం వాయిదా.. కారణమిదే!

ఉత్కంఠ రేపిన ఏపీ కేబినెట్ భేటీ చివరికి ఎటూ తేల్చకుండానే ముగిసింది. మూడు రాజధానుల ప్రతిపాదనపై కీలక నిర్ణయం తీసుకుంటుందని భావించిన కేబినెట్ సమావేశంలో చివరికి ఎటూ తేల్చలేదు. ఇప్పటికే మూడు కమిటీల నివేదికలు చేతిలో సిద్దంగా వున్నాయి. కానీ, ఇంకో కమిటీ ఇంకా రాజధానిపై నివేదిక ఇవ్వలేదు. సో.. అది కూడా వచ్చాకనే రాజధాని అంశంపై ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. ఇది శుక్రవారం కేబినెట్ సమావేశం తర్వాత తేలిన విషయం ఇదే. అసెంబ్లీ శీతాకాల […]

రాజధానిపై జగన్ నిర్ణయం వాయిదా.. కారణమిదే!
Follow us

|

Updated on: Dec 27, 2019 | 2:26 PM

ఉత్కంఠ రేపిన ఏపీ కేబినెట్ భేటీ చివరికి ఎటూ తేల్చకుండానే ముగిసింది. మూడు రాజధానుల ప్రతిపాదనపై కీలక నిర్ణయం తీసుకుంటుందని భావించిన కేబినెట్ సమావేశంలో చివరికి ఎటూ తేల్చలేదు. ఇప్పటికే మూడు కమిటీల నివేదికలు చేతిలో సిద్దంగా వున్నాయి. కానీ, ఇంకో కమిటీ ఇంకా రాజధానిపై నివేదిక ఇవ్వలేదు. సో.. అది కూడా వచ్చాకనే రాజధాని అంశంపై ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. ఇది శుక్రవారం కేబినెట్ సమావేశం తర్వాత తేలిన విషయం ఇదే.

అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆఖరు రోజు ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనతో ఏపీ వ్యాప్తంగా మొదలైన రాజధాని రగడ శుక్రవారం కీలక మలుపు తిరుగుతుందని అందరూ భావించారు. 11 రోజుల తర్వాత ఒకవైపు ఆందోళనలతో రాజధాని ప్రాంతం అగ్గి రగులుతూనే వుంది. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న అమరావతి ప్రాంత గ్రామాల ప్రజలు ఉద్యమిస్తూనే వున్నారు. మరోవైపు విశాఖ వంటి ప్రాంతాల్లో రాజధాని తమ ఏరియాకు రాబోతోందన్న సంతోషం వ్యక్తంమవుతోంది. ఇలాంటి తరుణంలో డిసెంబర్ 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. అయితే శుక్రవారం నాటి కేబినెట్ భేటీ కేవలం జిఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకే పరిమితమైనట్లు సమాచారం.

రాజధానిపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వద్ద జిఎన్ రావు, శివరామకృష్ణన్, పీటర్ కమిటీలు అందచేసిన నివేదికలున్నాయి. శుక్రవారం నాటి భేటీలో ఏపీ కేబినెట్ ప్రధానంగా జిఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదికపైనే చర్చించినప్పటికీ.. అంతకు ముందు పీటర్ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీల నివేదికలోని సారూప్య అంశాలను కూడా పరిశీలించింది. అయితే.. ఈ మూడు కమిటీలతోపాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇంకా రాజధానిపై నివేదిక ప్రభుత్వానికి అందజేయలేదు.

బోస్టన్ గ్రూపు నివేదిక జనవరి 3వ తేదీన రానున్నట్లు సమాచారం వుండడంతో ప్రస్తుతానికి రాజధానిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు ముఖ్యమంత్రి జగన్. జిఎన్ రావు నివేదికతోపాటు బోస్టన్ నివేదికలను అధ్యయనం చేసేందుకు ఒక హై పవర్ కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హైపవర్ కమిటీ జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలను పరిశీలిస్తుంది. నివేదికలను స్టడీ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.

జనవరి 3న బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక వచ్చిన తర్వాత హై పవర్ కమిటీ అధ్యయనం ప్రారంభించి, తగిన సూచనలు చేస్తే ఆ తర్వాత జరిగే కేబినెట్ భేటీలో జగన్ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ వుంది. అయితే ఇక్కడ మరో వాదన కూడా తెరమీద కనిపిస్తోంది. ఫిబ్రవరిలో ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. జనవరి నెల మొత్తం ఈ హైపవర్ కమిటీ రెండు నివేదికలపై అధ్యయనం కొనసాగిస్తే.. ఫిబ్రవరి అసెంబ్లీ సమావేశాలలో ఏపీ క్యాపిటల్ అంశాన్ని సభలో చర్చించి, అక్కడే ప్రభుత్వం ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తుందని కూడా ఇంకో వాదన వినిపిస్తోంది.