Byreddy Siddharth Reddy: ఎస్ఈసీ రమేష్ కుమార్ దానికి సమాధానం చెప్పాలి.. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సూటి ప్రశ్న..

Byreddy Siddharth Reddy: కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్లు...

Byreddy Siddharth Reddy: ఎస్ఈసీ రమేష్ కుమార్ దానికి సమాధానం చెప్పాలి.. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సూటి ప్రశ్న..
Follow us

|

Updated on: Jan 23, 2021 | 1:28 PM

Byreddy Siddharth Reddy: కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా వైసీపీ సిద్ధమంటూనే.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు సూటి ప్రశ్నలు సంధించారు. శనివారం నాడు మచిలీపట్నంలో పర్యటించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై స్పందించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు వైసీపీదే అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఎస్ఈసీ రమేష్ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపారంటూ ఆరోపించారు.

గతంలో ఎన్నికల ప్రక్రియను ఏకపక్షంగా నిలిపివేశారని, ఇప్పుడు మళ్లీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎన్నికల నిర్వహణకు పూనుకున్నారని విమర్శించారు. మరి గతంలో ఎలక్షన్లు వాయిదా వేసేటప్పుడు ఏకపక్షంగా ఎందుకు వ్యవహరించారో సమాధానం చెప్పాలని ఎస్ఈసీ రమేష్ కుమార్‌ను సిద్ధార్థ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుతో ఎస్ఈసీ చేతులు కలిపినా తమకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్నప్పుడే 151 సీట్లు గెలిచామని, ఇప్పుడు కూడా గెలిచి చూపిస్తామని సిద్ధార్థ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Also read:

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన యజమాని.. వారం రోజులపాటు అక్కడే నిరీక్షించిన పెంపుడు శునకం

రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న పువ్వాడ అజయ్‌.. ఖమ్మంలో బైక్‌ ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రవాణాశాాఖ మంత్రి