బైరెడ్డి సారూ..కాషాయ తీర్థం కన్ఫర్మా..?

బైరెడ్డి రాజశేఖరెడ్డి. ఎన్నికల ముందే పుట్టింటికి వెళ్లారు. మళ్లీ ఇప్పుడు ఆయన పక్క చూపులు చూస్తున్నారు. సీమలో పార్టీకి సీన్‌ లేదని కండువా మార్పిడికి సిద్ధమయ్యారు. మరీ బైరెడ్డి రైట్‌ స్టెప్‌ వెనుక కారణాలేంటి? అన్న చర్చ జరుగుతోంది. తాజాగా రాయలసీమపై బీజేపీ ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా కీలక నేతలను ఆకర్షించే పనిలో పడింది. కర్నూలు జిల్లాలో ఇప్పటికే టీజీ వెంకటేష్‌ కమలం కండువా కప్పుకున్నారు. కడప నుంచి సీఎం రమేశ్, ఆదినారాయణ రెడ్డి కాషాయ […]

బైరెడ్డి సారూ..కాషాయ తీర్థం కన్ఫర్మా..?
Byreddy
Follow us

| Edited By:

Updated on: Oct 23, 2019 | 8:31 AM

బైరెడ్డి రాజశేఖరెడ్డి. ఎన్నికల ముందే పుట్టింటికి వెళ్లారు. మళ్లీ ఇప్పుడు ఆయన పక్క చూపులు చూస్తున్నారు. సీమలో పార్టీకి సీన్‌ లేదని కండువా మార్పిడికి సిద్ధమయ్యారు. మరీ బైరెడ్డి రైట్‌ స్టెప్‌ వెనుక కారణాలేంటి? అన్న చర్చ జరుగుతోంది. తాజాగా రాయలసీమపై బీజేపీ ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా కీలక నేతలను ఆకర్షించే పనిలో పడింది. కర్నూలు జిల్లాలో ఇప్పటికే టీజీ వెంకటేష్‌ కమలం కండువా కప్పుకున్నారు. కడప నుంచి సీఎం రమేశ్, ఆదినారాయణ రెడ్డి కాషాయ కండువా కప్పుకోగా.. ఇప్పుడు మరో నేత బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఆయనే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.

ఎన్నికల ముందే బైరెడ్డి టీడీపీలో చేరారు. కానీ ఆ పార్టీ అధికారంలోకి మళ్లీ రాలేదు. దీంతో బైరెడ్డి చూపు బీజేపీ వైపు పడింది. ఈనెల 24న కర్నూలులో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో కండువా మార్పిడిపై కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. బైరెడ్డికి రాయలసీమలో మంచి పట్టుంది. నందికొట్కూరు,పాణ్యంలో అనుచరగణం ఉంది. 1994,99లో నందికొట్కూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నందికొట్కూరు రిజర్వ్‌ సీటు కావడంతో…పాణ్యంపై ఫోకస్‌ పెట్టారు. కానీ అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందలేకపోయారు. రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ పేరుతో సీమ జిల్లా సమస్యలపై దృష్టిపెట్టారు. అయితే ఎమ్మెల్యేలుగా గెలుపొందే పరిస్థితి లేకపోవడంతో పార్టీని మూసివేశారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. అయితే పార్టీ అధికారంలోకి రాలేదు. మరోవైపు వైసీపీ జిల్లాను క్లీన్‌స్వీప్‌ చేసింది. వైసీపీలోకి వెళ్లే దారి లేకపోవడంతో బీజేపీ వైపు బైరెడ్డి వెళుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బైరెడ్డి సిద్దార్థరెడ్డి వైసీపీలో పాగా వేశారు. నందికొట్కూరు రాజకీయాల్లో పట్టు సాధించారు. మరోవైపు బీజేపీలో టీజీ వెంకటేష్‌తో పాటు గంగుల ప్రతాప్‌రెడ్డి, ఆళ్లగడ్డలో భూమా వర్గీయులు కండువా కప్పుకున్నారు. బైరెడ్డి చేరికతో కర్నూలులో ఆ పార్టీకి అంతో ఇంతో పట్టు సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి.