సొంతగూటికి బుట్టా రేణుక?

టీడీపీకి ఎంపీ బుట్టా రేణుక షాకివ్వబోతున్నారని సమాచారం. టీడీపీకి ఆమె గుడ్‌ బై చెప్పబోతుందనే ప్రచారం ఊపందుకుంది. శనివారం ఇడుపులపాయలో వైసీపీ అధినేత జగన్‌ను కలవనున్నారని వినికిడి. కుటుంబసభ్యుల సూచనలతో ఆమె టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీలో చేరడంతో బుట్టా రేణుకకు టికెట్ ఇవ్వలేమని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసినట్లు వినికిడి. ఆదోని నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని టీడీపీ సూచించింది. టీడీపీ ప్రతిపాధనను ఆమె తిరస్క‌రించింది. రేణుకను వదులుకోవడానికి టీడీపీ […]

సొంతగూటికి బుట్టా రేణుక?
Follow us

| Edited By:

Updated on: Mar 15, 2019 | 9:21 PM

టీడీపీకి ఎంపీ బుట్టా రేణుక షాకివ్వబోతున్నారని సమాచారం. టీడీపీకి ఆమె గుడ్‌ బై చెప్పబోతుందనే ప్రచారం ఊపందుకుంది. శనివారం ఇడుపులపాయలో వైసీపీ అధినేత జగన్‌ను కలవనున్నారని వినికిడి. కుటుంబసభ్యుల సూచనలతో ఆమె టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీలో చేరడంతో బుట్టా రేణుకకు టికెట్ ఇవ్వలేమని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసినట్లు వినికిడి. ఆదోని నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని టీడీపీ సూచించింది. టీడీపీ ప్రతిపాధనను ఆమె తిరస్క‌రించింది. రేణుకను వదులుకోవడానికి టీడీపీ సిద్ధం లేదు…అందుకోసం ఆ పార్టీ మరో ఆఫర్ ఇచ్చింది. రాజ్యసభకు పంపుతామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చింది. రేణుక తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.