హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వికటించి వ్యాపారవేత్త మృతి

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఓ బిజినెస్‌ మ్యాన్ మృతికి కారణమైంది. వెంట్రుకలు లేక హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న ఆయన ఆ ప్రక్రియ ముగిసిన 40గంటల్లోనే మృత్యు ఒడికి చేరిపోయాడు. శస్త్రచికిత్స వికటించి అలర్జీకి గురౌవ్వడంతోనే ఆ బిజినెస్ మ్యాన్ మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంబైకి చెందిన శ్రవణ్ కుమార్ చౌదరి(43)అనే వ్యాపారవేత్త ముంబైలో ఉన్న చించ్‌పోక్లీలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో ట్రాన్స్‌ఫ్లాంటేషన్‌ చేయించుకున్నాడు. ఇందుకోసం మార్చి 7న […]

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వికటించి వ్యాపారవేత్త మృతి
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2019 | 11:00 AM

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఓ బిజినెస్‌ మ్యాన్ మృతికి కారణమైంది. వెంట్రుకలు లేక హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న ఆయన ఆ ప్రక్రియ ముగిసిన 40గంటల్లోనే మృత్యు ఒడికి చేరిపోయాడు. శస్త్రచికిత్స వికటించి అలర్జీకి గురౌవ్వడంతోనే ఆ బిజినెస్ మ్యాన్ మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ముంబైకి చెందిన శ్రవణ్ కుమార్ చౌదరి(43)అనే వ్యాపారవేత్త ముంబైలో ఉన్న చించ్‌పోక్లీలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో ట్రాన్స్‌ఫ్లాంటేషన్‌ చేయించుకున్నాడు. ఇందుకోసం మార్చి 7న అతడు క్లినిక్‌కు వెళ్లగా.. దాదాపు 12గంటల పాటు జరిగిన ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ 8వ తేది ఉదయం 2.30గం.ల వరకు సాగింది. ఆ మరుసటి రోజు మొహం, గొంతు వాచిపోవడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఊపిరి ఆడక శ్రవణ్ కుమార్ మరణించాడు. సాధారణంగా ఒకేసారి 3,000వెంట్రుకలకు మించి పెట్టకూడదని, కానీ చెప్తున్న వినకుండా శ్రవణ్ 9,000 వెంట్రుకలు పెట్టించుకున్నాడని అతడికి చికిత్స చేసిన వైద్యుడు తెలిపాడు. దీనిని ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.