Breaking News
  • హైదరాబాద్: రేపటి నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు. బెంగళూరు మినహా కర్నాటక, మహారాష్ట్రకు బస్సులు . సర్వీసుల పునరుద్ధరణకు టీఎస్‌ ఆర్టీసీకి ప్రభుత్వ అనుమతి. తెలంగాణకు బస్సు సేవలను పునరుద్ధరించిన కర్నాటక, మహారాష్ట్ర. ముంబై, పుణె, గుల్బర్గా, నాగ్‌పూర్‌, రాయచూర్‌, బీదర్, నాందేడ్.. చంద్రాపూర్ సహా ముఖ్యమైన మార్గాల్లో మళ్లీ తిరగనున్న బస్సులు.
  • నేడు దేశ వ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు. దేశ వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 1.51 లక్షల మంది విద్యార్థులు. ఉ.9గంటల నుంచి మ.12 గంటల వరకు పేపర్-1. మ.2:30 నుంచి సా.5:30 వరకు పేపర్‌-2. వచ్చే నెల 5న వెలువడనున్న జేఈఈ ఫలితాలు.
  • విజయవాడ: కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి. ప్రస్తుత ఇన్ ఫ్లో 3,52,579 అవుట్ ఫ్లో 3,38,600 క్యూసెక్కులు . వరద ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తంచేసిన జిల్లాకలెక్టర్ ఇంతియాజ్ . ప్రకాశం బ్యారేజి ఎగువన గల పులిచింతల ప్రాజెక్ట్ నుండి వచ్చే వరద ప్రవాహం ప్రస్తుతం 460000 క్యూసెక్కులు.. వరద ప్రవాహం క్రమేణా పెరిగి 5.50 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కులకు పెరిగి ప్రకాశం బ్యారేజికి చేరుకునే అవకాశం. ఈ రోజు 11.30 గంటల సమయానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు.
  • ఉగ్రవాది అరెస్ట్‌ : పశ్చిమబెంగాల్‌: ముర్షిదాబాద్‌లో అల్‌ఖైదా ఉగ్రవాది సమీమ్‌ అన్సారీ అరెస్ట్‌ . ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌. ట్రాన్సిట్‌ రిమాండ్‌కు అనుమతిచ్చిన సీజేఎం కోర్టు. అన్సారీని ఢిల్లీలోని ఎన్‌ఐఏ కోర్టుకు తరలించనున్న ఎస్‌టీఎఫ్‌ .
  • దుర్గం చెరువు పై సందర్శకులకు తాత్కాలిక బ్రేక్. రెండు రోజుల పాటు సందర్శన నిలిపి వేసిన పోలీసులు. ఆదివారం కావడం తో భారీగా దుర్గం చెరువు వద్దకు వస్తున్న సందర్శకులు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం తర్వాత సందర్శకులకు అనుమతి నిరాకరణ. కేబుల్ బ్రిడ్జి పైన సెక్యూరిటీ పరమైన ఆక్టివిటీస్ జరుగుతుండడంతో పర్యాటకులను అనుమతించని పోలీసులు. కేబుల్ బ్రిడ్జి ను సందర్శించడానికి వస్తున్న ప్రజలను పోలీసులు అనుమతించకపోవడంతో నిరాశతో వెనుతిరుగుతున్న పబ్లిక్.
  • తూర్పు బీహార్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. ఈశాన్య జార్ఖండ్‌, ఒడిశా మీదుగా మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు. నేడు, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు-వాతావరణశాఖ.
  • మాజీ కేంద్ర మంత్రి శ్రీ జస్వంత్ సింగ్ అకాల మృతి పట్ల సంతాపం తెలియ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. శ్రీ అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ, ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేసిన శ్రీ జస్వంత్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని గవర్నర్ శ్రీ హరిచందన్ తెలిపారు. శ్రీ జస్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కలియుగ దానకర్ణుడు చార్లెస్ చక్ ఫినీ !

పది రూపాయిలు దానం చేయడాని పదిసార్లు ముందూ వెనుకా ఆలోచిస్తాం. అలాంటిది తను జీవిత కాలం సంపాదించిన యావదాస్తి 8 బిలియన్ల డాలర్లు అంటే రూ.58 వేల కోట్లను దారాదత్తం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు ఛార్లెస్ ‘చక్‌’ ఫీనీ.

businessman Charles Finney donated property to charity, కలియుగ దానకర్ణుడు చార్లెస్ చక్ ఫినీ !

పది రూపాయిలు దానం చేయడాని పదిసార్లు ముందూ వెనుకా ఆలోచిస్తాం. అలాంటిది తాను జీవితాంతం సంపాదించిన ఆస్తిని దానం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. తనకున్న యావదాస్తి 8 బిలియన్ల డాలర్లు అంటే రూ.58 వేల కోట్లను దారాదత్తం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు డ్యూటీ ఫ్రీ షాపర్స్ సహ-వ్యవస్థాపకుడు ఛార్లెస్ ‘చక్‌’ ఫీనీ. తన స్వచ్ఛంద సంస్థ ‘అట్లాంటిక్‌ ఫిలాంత్రోపీస్‌’ ద్వారా తనకున్న ఆస్తిని దానం చేసి తన ఔదర్యాన్ని చాటుకున్నారు.

ఎనిమిదేళ్ల కిందట ప్రకటించినట్టే మొత్తం ఆస్తిని దానం చేసి మాట నిలబెట్టుకున్నారు. కోట్లకు పడగెత్తినా దాతృత్వంలోనే ఆనందాన్ని వెదుకున్నారు. పదవీ విరమణ తర్వాత తన భార్యతో కలిసి జీవించేందుకు రూ.14కోట్లనే ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలకు దానమిచ్చేశారు. ప్రస్తుత నెలతో ఆయన దానాలు పూర్తి కావడంతో ఈ నెల 14న ఫీనీ స్వచ్ఛంద సంస్థ ప్రయాణం ముగిసింది.

‘చాలా నేర్చుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నేను బతికుండగానే ఈ మంచి పని పూర్తి కావడం నాకు ఎంతో సంతృప్తిగా ఉంది.. ఈ ప్రయాణంలో తనకు సహకరించి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు. బతికుండగానే దానం చేయడం గురించి ఆశ్చర్యపోతున్నవారికి దీన్ని ప్రయత్నించండి, మీకు నచ్చుతుంది’’ అని ఛార్లెస్ ఫోర్బ్స్‌ పత్రికతో వ్యాఖ్యానించారు.

బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ తమ దాతృత్వాన్ని చాటుకోవడం వెనుక ఫీనియే స్ఫూర్తిదాత. ‘మా అపార సంపదలను దానం చేయడానికి చక్‌ మాకు ఓ మార్గం చూపారు. సగం అస్తులు కాదు, యావదాస్తిని దానం చేయాలంటూ తను నాతో పాటు ఎంతోమందిలో స్ఫూర్తిని కలిగించారు’ అని బిల్‌ గేట్స్‌ పేర్కొన్నారు. దానంలో జేమ్స్‌బాండ్‌గా చార్ల్స్ చక్‌ను అందరూ పిలుస్తారు. తొలిసారిగా 1984లో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి ఉత్తర ఐర్లాండ్‌లో శాంతి, అలాగే వియత్నాంలో ఆరోగ్య సంరక్షణకు కృషిచేశారు.

ఒకప్పుడు రూ.58వేల కోట్ల ఆస్తిపరుడు ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ సాధారణ అపార్ట్‌మెంట్‌‌లో భార్యతో కలిసి విశ్రాంత జీవితాన్ని ఓ మధ్యతరగతి మనిషిలా గడపడం గొప్ప విషయం. ఛార్లెస్ చక్ 1960లో రాబర్ట్ మిల్లర్‌తో కలిసి డ్యూటీ ఫ్రీ షాపర్స్‌ను ఏర్పాటుచేశారు. తన ఆస్తిలో 3.7 బిలియన్లు విద్యకు, 870 మిలిన్లు మానవ హక్కులు, సామాజిక మార్పునకు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి 76 మిలియన్లు, వియత్నాంలో ప్రజారోగ్య సంరక్షణకు 270 మిలియన్ డాలర్లు, మరో 700 మిలియన్ డాలర్ల ఆరోగ్య సంరక్షణకు అందజేశారు.

చివరిగా న్యూయార్క్ నగరం రూజ్‌వెల్ట్ ద్వీపంలో టెక్నాలజీ క్యాంపస్‌ను నిర్మాణం కోసం 350 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ‘విలువైన కారణాలకు మద్దతు తెలపడం ద్వారా చాలా మంచిని సాధించగలిగినప్పుడు ఇవ్వడంలో ఆలస్యానికి నేను చాలా తక్కువ కారణాలను వెదుకుతాను. అలా కాకుండా, మీరు చనిపోయినప్పుడు ఇవ్వడం కంటే మీరు బతికున్నటప్పుడు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంటుంది’అని గతేడాది ఈ దానకర్ణుడు వ్యాఖ్యానించారు.

Related Tags