Aadhar card: ఆధార్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జిరాక్సులు బంద్.. UIDAI కీలక ఆదేశాలు

ఇక నుంచి ఆధార్ కార్డ్ జిరాక్సులు బంద్ కానున్నాయి. జిరాక్సుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు యూఐడీఏఐ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కొత్త రూల్ తీసుకొచ్చింది. జిరాక్సులకు ప్రత్యామ్నంగా మాస్క్డ్ ఆధార్ ఉపయోగించాలని తెలిపింది. ఈ మాస్క్డ్ ఆధార్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

Aadhar card: ఆధార్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్..  జిరాక్సులు బంద్.. UIDAI కీలక ఆదేశాలు
Aadhar Supreme

Updated on: Dec 09, 2025 | 3:01 PM

ఆధార్ కార్డు విషయంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలు సురక్షితంగా సేవలు అందించేలా అనేక రూల్స్ తీసుకొస్తుంది. ఏవైనా సేవలు అందించడానికి కొంతమంది ఆధార్ కార్డు జిరాక్సులు తీసుకుని వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. దీని వల్ల ఆధార్ కార్డు వినియోగం తప్పుదారి పట్టడంతో పాటు ప్రజలకు నష్టం చేకూరుతుంది. దీనిని అరికట్టేందుకు యూఐడీఏఐ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇకపై ఎవరితోనూ ఆధార్ జిరాక్స్ కాపీ పంచుకోవద్దని స్పష్టం చేసింది. దీనికి ప్రత్యామ్నంగా మరో కీలక సూచన చేసింది.

మాస్క్డ్ ఆధార్

ఇకపై మీరు ఎవరితోనైనా ఆధార్ కార్డు పంచుకోవాలంటే జిరాక్స్ కాపీకి బదులు మాస్క్డ్ ఆధార్ ఇవ్వాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. యూఐడీఏఐ వెబ్‌సైట్లోకి వెళ్లి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. వెబ్‌సైట్లో మీరుకు మాస్క్డ్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మాస్క్డ్ ఆధార్‌లో మీకు ఆధార్ నెంబర్ చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి.

యాప్ ద్వారా వెరిఫికేషన్

ఆఫ్‌లైన్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్ చేయాలనుకునే సంస్థలకు అప్లికేషన్ ప్రొగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ యాక్సెస్ కల్పిస్తారు. దీనికి సంబంధించిన యాప్‌ను బీటా వెర్షన్‌లో టెస్టింగ్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులు, ఇతర టచ్‌పాయింట్లలో వయస్సు ధృవీకరణ అవసరమైన చోట ఈ కొత్త యాప్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చే బదులు ఈ యాప్ ద్వారా పేపర్‌లెస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక యాప్ ఉంటే మీరు ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. మీ కుటుంబసభ్యుల వివరాలను కూడా ఇందులో పొందుపర్చుకోవచ్చు.  ఇక ఈ  ఆధార్ యాప్‌ సహాయంతో యూజర్లు ప్రూఫ్ డాక్యుమెంట్స్‌ అప్‌డేట్ చేసుకోవచ్చు.  అంతేకాకుండా మొబైల్ నంబర్ కూడా సులభంగా మార్చుకోవచ్చు.