కొత్త బైక్‌ కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. వడ్డీ లేకుండా రుణం.. కేవలం రూ.5 వేలు కడితే బైక్‌ మీ సొంతం

కొత్త బైక్‌ కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. వడ్డీ లేకుండా రుణం.. కేవలం రూ.5 వేలు కడితే బైక్‌ మీ సొంతం

New Bike: కొత్త బైక్‌ కొనుగోలు చేసే వారికి ఓ బంపర్ ఆఫర్. టీవీఎస్‌ మోటారు నుంచి అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులో ఉంది. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తోంది..

Subhash Goud

| Edited By: Ravi Kiran

Jul 04, 2021 | 8:15 AM

New Bike: కొత్త బైక్‌ కొనుగోలు చేసే వారికి ఓ బంపర్ ఆఫర్. టీవీఎస్‌ మోటారు నుంచి అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులో ఉంది. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తోంది. దీంతో కొత్త బైక్ కొనే వారికి బెనిఫిట్ కలుగనుంది. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన బైక్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ, 200 4వీ బైక్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. 3 నెలల నుంచి 6 నెలల వరకు మాత్రమే నో కాస్ట్ ఈఎంఐ వర్తిస్తుంది. ఈ ఆఫర్ జూలై 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డు కలిగిన వారికే ఆఫర్ వర్తిస్తుంది.

టీవీఎస్ మోటార్ ప్రకారం చూస్తే.. మీరు కేవలం రూ.5 వేలు డౌన్ పేమెంట్‌తో అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. టీవీఎస్ నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ స్కూటీ పెప్ట్, జెస్ట్ స్కూటర్లకు కూడా వర్తిస్తుంది. ఆఫర్ షోరూమ్ ప్రాతిపదికన మారవచ్చు. అందువల్ల మీరు మీ దగ్గరిలో ఉన్న టీవీఎస్ షోరూమ్‌కు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇకపోతే అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టైలిష్ లుకింగ్ ఈ బైక్‌ సొంతం. ఎల్ఈడీ హెడ్‌లైట్, ట్విన్ డీఆర్ఎల్ అప్‌ప్రంట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ఏబీఎస్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. కాగా, కరోనా మహమ్మారి కాలంలో చాలా బైక్‌ కంపెనీలు కస్టమర్లకు మరిన్ని ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే కోవిడ్‌ పరిస్థితుల్లో ఎవరు కూడా పెద్దగా డబ్బులు పెట్టి కొనేంత పరిస్థితి లేదు. దీంతో కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అలాగే తక్కువ వడ్డీలో రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Voter ID Address Change: మీ ఓటర్‌ ఐడీ కార్డులో అడ్రస్‌ను మార్చాలనుకుంటున్నారా..? ఇలా చేయండి

Paytm: పేటీఎం బంపర్‌ ఆఫర్‌.. రూ.50 కోట్ల క్యాష్‌బ్యాక్‌లు.. యాప్‌ ద్వారా చెల్లింపులు జరిపే వారికి బెనిఫిట్స్‌..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu