Banking: కొత్త వడ్డీ రేట్లు వచ్చాయ్.. సేవింగ్స్ అయినా, ఎఫ్ డీ అయినా ఈ బ్యాంకే బెస్ట్..

|

Sep 26, 2024 | 5:56 PM

Suryoday Small Finance Bank: వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. బ్యాంకులను బట్టి వడ్డీరేట్లు మారుతుంటాయి. అయితే సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అటు సేవింగ్స్ ఖాతాలు, ఇటు ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలు రెండింటిపైనా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ప్రకటించింది. సెప్టెంబర్ నాలుగో తేదీన ఈ వడ్డీ రేట్లను సవరించింది. 

Banking: కొత్త వడ్డీ రేట్లు వచ్చాయ్.. సేవింగ్స్ అయినా, ఎఫ్ డీ అయినా ఈ బ్యాంకే బెస్ట్..
Cash
Follow us on

సాధారణంగా సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే దేని ప్రయోజనాలు దానికి ఉంటాయి. ఈ వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. బ్యాంకులను బట్టి వడ్డీరేట్లు మారుతుంటాయి. అయితే సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అటు సేవింగ్స్ ఖాతాలు, ఇటు ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలు రెండింటిపైనా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ప్రకటించింది. సెప్టెంబర్ నాలుగో తేదీన ఈ వడ్డీ రేట్లను సవరించింది. సేవింగ్స్ ఖాతాలతో పాటు రూ. 3కోట్ల విలువైన ఫిక్స్ డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్యూరోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లు..

స్యూరోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ప్రకారం సెప్టెంబర్ 4న వడ్డీ రేట్లను సవరించింది. ఈ సవరణ తర్వాత సాధారణ ప్రజలు ఫిక్స్ డ్ డిపాజిట్(ఎఫ్డీ) చేస్తే 4.00శాతం నుంచి 8.60శాతం వరకూ వడ్డీ ఇస్తోంది. అదే సీనియర్ సిటిజెన్స్ కు అయితే 4.0శాతం నుంచి 9.10శాతం వరకూ రేటు ఉంటుంది. రూ. 3కోట్లు కన్నా తక్కువైన పెట్టుబడులపై ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల లోపు కాల వ్యవధికి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. రోజుల వారీ వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • ఏడు రోజుల నుంచి 14 రోజుల వరకూ చేసే ఫిక్స్ డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 4.00శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 4.50శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • 15 రోజుల నుంచి 45 వరకూ సాధారణ పౌరులకు 4.25శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 4.75 వడ్డీ రేటు ఉంటుంది.
  • 46 రోజుల నుంచి 90 రోజుల వరకూ సాధారణ పౌరులకు 4.50శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 5.00శాతం వరకూ వడ్డీ రేటు ఉంటుంది.
  • 91 రోజుల నుంచి 6 నెలల వరకూ ఉండే ఎఫ్డీ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 5.00శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 5.50శాతం వరకూ వడ్డీ రేటు ఉంటుంది.
  • ఆరు నెలల ఒక రోజు వరకూ ఉండే ఎఫ్డీలపై సాధారణ పౌరులకు 7.25శాతం సీనియర్ సిటిజెన్స్ కు 7.75శాతం వరకూ వడ్డీ రేటు ఉంటుంది.
  • ఆరు నెలల ఒక రోజు నుంచి 9 నెలల కాలానికి సాధారణ పౌరులకు 5.50శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 6.00శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం వరకూ సాధారణ పౌరులకు 6.00శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 6.50శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • ఒక ఏడాది కాల వ్యవధితో ఉండే ఎఫ్డీపై సాధారణ పౌరులకు 6.85శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.35శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • ఒక ఏడాది నుంచి 15 నెలల కాల వ్యవధికి ఎఫ్డీపై సాధారణ పౌరులకు 8.25శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 7.35శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • 15 నెలల నుంచి రెండేళ్ల వరకూ సాధారణ పౌరులకు 8.50శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 9.00శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • రెండేళ్ల నుంచి మూడేళ్ల కాల వ్యవధితో వచ్చే సాధారణ పౌరులకు 8.60శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 9.10శాతం వడ్డీ ఉంటుంది.

సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లు..

  • రూ. 1లక్ష క్లోజింగ్ బ్యాలెన్స్ పై 3శాతం వార్షిక వడ్డీ రేటు ఉంటుంది.
  • రూ. 1లక్ష నుంచి రూ. 5లక్షల వరకూ 5శాతం వార్షిక వడ్డీ రేటు ఇస్తుంది.
  • ఐదు లక్షల నుంచి రూ. 10లక్షల వరకూ 7.25శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • రూ. 10లక్షల నుంచి రూ. 2కోట్లు క్లోజింగ్ బ్యాలెన్స్ పై 7.50శాతం వడ్డీ రేటు ఇస్తుంది.
  • రూ. 2కోట్ల నుంచి రూ. 5కోట్ల వరకూ ఉండే బ్యాలెన్స్ పై 7.50శాతం వడ్డీ రేటు ఉంటుంది.
  • రూ. 5కోట్ల నుంచి రూ. 25కోట్ల వరకూ ఉండే బ్యాలెన్స్ లపై 7.75శాతం వడ్డీ రేటు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..