Policy Surrender: బీమా పాలసీని మధ్యలో వదిలేశారా.. మీ డబ్బులు మీకు రావాలంటే ఇలా చేయండి..
పాలసీని నిర్ణీత కాలానికన్నా ముందుగానే వెనుకకు ఇచ్చేయడాన్ని సరెండర్ చేయడం అంటారు. ఆ పాలసీ వల్ల లాభాలు, ప్రయోజనం లేదనుకున్నపుడు, మరే ఇతర కారణాల వల్లనైనా కొందరు నిలిపివేస్తారు. ఉద్యోగం పోయినప్పుడు, ప్రీమియం చెల్లించలేని పరిస్థితి ఎదురైనప్పుడు కూడా సరెండర్ చేస్తూ ఉంటారు. ఇలా మధ్యలో సరెండర్ చేసిన పాలసీదారులకు బీమా కంపెనీ అందించే మొత్తాన్నే సరెండర్ వాల్యూ అంటారు.
భవిష్యత్తు అవసరాలు, అనుకోని ఆపద వచ్చినప్పుడు అండగా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీలు తీసుకుంటారు. వీటికి ప్రతినెలా, అర్థ సంవత్సరం, ఏడాదికి ఒకసారి ప్రీమియం చెల్లిస్తూ ఉంటారు. పాలసీలు నిర్ణీత కాలానికి మెచ్యూర్ అవుతాయి. అప్పుడు మనకు వడ్డీ తో సహా మొత్తం అందుతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే సమయానికి పాలసీ సొమ్ము చేతికి వచ్చేలా ప్రణాళిక రూపొందించుకుంటారు.
సరెండర్ అంటే..
పాలసీని నిర్ణీత కాలానికన్నా ముందుగానే వెనుకకు ఇచ్చేయడాన్ని సరెండర్ చేయడం అంటారు. ఆ పాలసీ వల్ల లాభాలు, ప్రయోజనం లేదనుకున్నపుడు, మరే ఇతర కారణాల వల్లనైనా కొందరు నిలిపివేస్తారు. అప్పుడు పాలసీని బీమా కంపెనీకి సరెండర్ చేస్తారు. ఉద్యోగం పోయినప్పుడు, ప్రీమియం చెల్లించలేని పరిస్థితి ఎదురైనప్పుడు కూడా సరెండర్ చేస్తూ ఉంటారు. ఇలా మధ్యలో సరెండర్ చేసిన పాలసీదారులకు బీమా కంపెనీ అందించే మొత్తాన్నే సరెండర్ వాల్యూ అంటారు. దీనికి అనేక నిబంధనలు ఉంటాయి.
పాలసీదారులకు శుభవార్త..
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) జీవిత బీమా పాలసీదారులకు శుభవార్త చెప్పింది. బీమా పాలసీని సరెండర్ చేసినా పాలసీదారుడికి డబ్బు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకుంది. ఇందుకోసం నిబంధనలను మార్చింది. సరెండర్ విలువ అధికంగా వచ్చేలా చర్యలు తీసుకుంది. గతంలో ఐదేళ్ల లోపు పాలసీ నుంచి బయటకు వెళ్లేవారికి ఎక్కువ డబ్బులు వచ్చేవి కాదు. అలాగే మొదటి సంవత్సరంలో మానేసే వారికి వాపసు పొందే అవకాశం లభించేది కాదు.
నిబంధనల మార్పు..
పాలసీదారులకు మేలు జరిగేలా ఐఆర్‌డీఏఐ నిబంధనలను మార్పు చేసింది. అనేక చర్చలు, ప్రతిపాదనల తర్వాత ఎండోమెంట్ పాలసీల కోసం అధిక ప్రత్యేక సరెండర్ విలువను నిర్ణయించింది.
ప్రత్యేక సరెండర్ వాల్యూ..
పాలసీ నుంచి ముందుగానే నిష్కృమించేవారికి లభించే మొత్తాన్నే ప్రత్యేక సరెండర్ విలువ లేదా స్పెషల్ సరెండర్ వాల్యూ (ఎస్‌ఎస్‌వీ) అంటారు. దీనిని లెక్కించడానికి పెయిడ్ అప్ విలువలు ఫార్ములా ఉపయోగిస్తారు. చెల్లించిన ప్రీమియాల సంఖ్యను హామీ మొత్తంతో గుణిస్తారు. చెల్లించాల్సిన మొత్తం ప్రీమియాల సంఖ్యతో భాగిస్తారు.
కొత్త నిబంధనలతో మేలు..
కొత్త నిబంధనలతో పాలసీదారులకు ఎంతో మేలు జరుగుతుంది. పాలసీని ఏడాదిలోనే సరెండర్ చేసినా మీరు కట్టిన ప్రీమియాలలో కొంత మొత్తం తిరిగి వస్తుంది. బీమా సంస్థలు తగ్గింపు ప్రయోజనాల కోసం 10 సంవత్సరాల జి-సెకన్ దిగుబడిని పరిగణనలోకి తీసుకుంటాయి. అలాగే ఆరోగ్యం, సాధారణ ఇన్స్యూరెన్స్ తదితర జీవిత బీమా సంస్థలు వివరాలను స్పష్టంగా వివరించడానికి పాలసీ డాక్యుమెంట్‌లతో కూడిన కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్)ను తప్పనిసరిగా జారీ చేయాలి. బీమా సంస్థలు ఇండెక్స్ లింక్డ్ ప్లాన్లు, వేరియబుల్ యాన్యుటీ చెల్లింపు ఎంపికలతో సహా వివిధ ఉత్పత్తులను రూపొందించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..