దేశంలో పెట్రోల్ ధరల పరిస్థితి అందరికీ తెలిసిందే. పైపైకి ఎగబాకడం తప్ప.. తగ్గేదేలే అన్నట్లు కొండెక్కి కూర్చున్నాయి. ఇలాంటి టైంలో కొత్త బైక్ కొనాలనుకుంటే.. సుమారు రూ. 80 వేలకు పైగా డబ్బులు వెచ్చించాల్సిందే. అందుకే సెకండ్ హ్యాండ్ బైకుల వైపు మొగ్గు చూపుతున్నారు జనాలు. అందుకే అలాంటి వారికోసం రూ. 30 వేలలోపు అధిక మైలేజ్ ఇచ్చే పలు బైకులు(Bikes) గురించి ఇప్పుడు చూద్దాం..
Honda Activa 4G STD: మీరు Honda Activa 4G బైక్‌ను రూ. 30 వేలకు కొనుగోలు చేయొచ్చు. ఈ బైక్ ‘Dekho’ అనే వెబ్సైట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది సెకండ్ హ్యాండ్ సెగ్మెంట్ బైక్, 2017 మోడల్. వెబ్సైట్లో పొందుపరిచిన సమాచారం ప్రకారం, ఈ బైక్ 18 వేల కిలోమీటర్లు తిరిగింది. 109.19 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 60 కెఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది. కాగా, ఈ బైక్‌కు ట్యూబ్‌లెస్ టైర్లు, డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.
Suzuki Access 125: ఓఎల్ఎక్స్లో సుజుకి యాక్సెస్ 125 రూ.26,500కి కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. 2015 మోడల్, 125 సీసీ ఇంజన్ కలిగిన ఈ బైక్ ఇప్పటిదాకా 18 వేల కిలోమీటర్లు నడిచింది.
Mahindra Gusto: ఢిల్లీ ఆర్టీఓ నెంబర్‌తో ‘BikeDekho’ వెబ్సైట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది మహీంద్రా గస్టో స్కూటర్. దీని ధర రూ. 29 వేలుగా నిర్ణయించబడింది.
Yamaha Saluto 125: ఓఎల్ఎక్స్లో Yamaha Saluto 125 బైక్ రూ. 25 వేలకు ‘BikeDekho’ వెబ్సైట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఢిల్లీ ఆర్టీఓ నెంబర్‌తో ఉన్న ఈ బైక్ 2015 మోడల్. ఇది ఇప్పటిదాకా రూ. 20 వేల కిలోమీటర్లు తిరిగింది.
Suzuki Access 125: సుజుకి యాక్సెస్ 125 సెకండ్ హ్యాండ్ బైక్ రూ.27 వేలకు ‘BikeDekho’ వెబ్సైట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది 2013 మోడల్ కాగా.. ఢిల్లీ ఆర్టీఓ నెంబర్‌తో రిజిస్టర్ అయి ఉంది.