ఇంజనీర్‌ జాబ్‌ని వదిలేసి రైతుగా మారాడు.. ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు..

Agriculture News: చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే అతడికి మక్కువ ఎక్కువ. అయినా పెద్ద చదువులు చదివి ఇంజనీర్ జాబ్‌ సంపాదించాడు.

ఇంజనీర్‌ జాబ్‌ని వదిలేసి రైతుగా మారాడు.. ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు..
Yatendra Nath Jha
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 22, 2021 | 6:55 AM

Agriculture News: చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే అతడికి మక్కువ ఎక్కువ. అయినా పెద్ద చదువులు చదివి ఇంజనీర్ జాబ్‌ సంపాదించాడు. కానీ వ్యవసాయం మీద ప్రేమ తగ్గకపోవడంతో చివరకు సాగుబాట పట్టాడు. ఆ తర్వాత వ్యవసాయంలోనే తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నాడు. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం ద్వారా వందలాది మంది పోషకాహార లోపం ఉన్న పేదలకు ప్రతి వారం ఒక రోజు ఉచితంగా కూరగాయలు అందిస్తున్నాడు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని యజువార్ గ్రామానికి చెందిన యతేంద్రనాథ్ ఝా, మిలీనియం సిటీలోని ప్రజలకు సేంద్రీయంగా పండించిన కూరగాయలను అందిస్తున్నాడు. వందలాది మంది రైతులను సేంద్రీయ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నాడు.

యతేంద్రనాథ్ ఝా ఆర్గానిక్ గురుగ్రామ్ పేరుతో తన సంస్థను నడుపుతున్నాడు. తన సంస్థ గురించి మాట్లాడుతూ.. కాలానుగుణంగా ప్రజల ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులను ఇక్కడి రైతులకు వివరించే ప్రయత్నం చేశానని చెప్పాడు. చాలా వ్యాధులకు మూలం పొలాల్లో వేసే రసాయన ఎరువులే. కాబట్టి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తున్నానని చెప్పుకొచ్చాడు. మిలీనియం సిటీ ప్రజలు ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలను సులభంగా పొందగలుగుతున్నారు.

ఆర్గానిక్ గురుగ్రామ్ కింద 12 మంది రైతులు నాలుగు గ్రామాల్లోని 80 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం ప్రారంభించారు. ఈ రైతులు ఎలాంటి రసాయన ఎరువులు, మందులు వాడకుండా కూరగాయలు పండిస్తున్నారు. మీరు నేరుగా వెళ్లి సేంద్రియ కూరగాయలను కొనుగోలు చేయవచ్చు. వారి కోసం మండీలు, దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ సీజన్‌లో పొలాల్లో ఉల్లి, క్యాప్సికం, అల్లం, వెల్లుల్లి, బచ్చలికూర, టమాటా, పొట్లకాయ, సొరకాయ, టమాటా, దోసకాయ, గుమ్మడి, బెండకాయ, ఉసిరి, ఆకుకూరలు పండిస్తున్నారు.

తక్కువ ఖర్చుతో వ్యవసాయం సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు రసాయనాల ద్వారా పండించినవాటికంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అదేవిధంగా రుచిలో కొంచెం తీపి ఉంటుంది. ఇది దీని ప్రత్యేకత. యతేంద్రనాథ్ ఝా సంస్థ హిమాలయ ఫౌంటెన్ ఇప్పుడు MSME కంపెనీగా మారింది. ఏడాదికి ఒకటి నుంచి 1.5 కోట్ల వరకు సంపాదిస్తారు. సేంద్రియ, సంప్రదాయ వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి ప్రజలు వారి వద్దకు వస్తారు. తక్కువ ఖర్చుతో కూరగాయల సాగు గురించి వారికి సమాచారం అందిస్తారు.

బూస్టర్‌ డోస్‌ తీసుకుంటే రూ.7500 నగదు బహుమతి..! ఈ ఆఫర్ డిసెంబర్‌ 31లోపు మాత్రమే..?

’83’ సినిమాపై పన్ను మినహాయింపు.. సినీ ప్రేమికులకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గిఫ్ట్‌

ఆధార్‌ కార్డుతో ఓటర్‌ ఐడి లింక్‌ చేస్తే ప్రయోజనాలేమిటి..? ప్రభుత్వం ప్రతిపాదించే కొత్త బిల్లు గురించి తెలుసుకోండి..