Silver Price Today: పతనమవుతున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎంతమేర తగ్గిందంటే..?

Today Silver Price: బంగారం ధరలు, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరోరోజూ పెరుగుతున్నాయి. దేశంలో

Silver Price Today: పతనమవుతున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎంతమేర తగ్గిందంటే..?
Silver Price Today
Follow us

|

Updated on: Apr 01, 2021 | 5:10 AM

Today Silver Price: బంగారం ధరలు, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరోరోజూ పెరుగుతున్నాయి. దేశంలో బంగారం, వెండి ధరల్లో నిత్యం వ్యత్యాసం ఉంటోంది. దేశంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పు చోటు చేసుకుంటుంది. నిన్న తగ్గిన వెండి ధరలు కాస్తా.. గురువారం మళ్లీ తగ్గాయి. బుధవారం 63,900లకు ఉన్న కిలో వెండి.. నేడు 63,200 లు ఉంది. అంటే మరో 700ల రూపాయలు తగ్గింది. దీంతోపాటు తెలుగు రాష్ట్రాలతోపాటు.. కొన్ని నగరాల్లో ఏకంగా రూ.1200 లు మేర తగ్గింది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 63,200 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.63,200 ఉంది. చెన్నైలో రూ.67,300 ఉండగా, బెంగళూరులో రూ.65,500 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.63,200 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో వెండి కిలో రూ.67,300 ఉంది. విజయవాడలో రూ.67,300 వద్ద కొనసాగుతోంది.

బంగారం.. ఇదిలాఉంటే.. దేశంలో పలుచోట్ల బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,100 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.44,840 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 41,100 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 44,840 వద్ద కొనసాగుతోంది.

Also Read:

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

Deen Dayal awards – 2021: తెలుగు రాష్ట్రాలకు జాతీయ అవార్డుల పంట.. ఏయే పంచాయతీలకు వచ్చాయంటే..? వివరాలు