స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు స్వల్పలాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 11,687, సెన్సెక్స్‌ 84 పాయింట్లు లాభపడి 39,215 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫినాన్స్‌ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీలోని ఆటో సూచీ తప్పితే మిగిలినవి మొత్తం లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. డీసీబీ బ్యాంక్‌ షేర్లు 14శాతం కుంగాయి. ఈ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసికానికి అంచనాల కన్నా తక్కువ స్థాయిలో ఫలితాలను ప్రకటించడంతో […]

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు!
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2019 | 4:43 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు స్వల్పలాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 11,687, సెన్సెక్స్‌ 84 పాయింట్లు లాభపడి 39,215 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫినాన్స్‌ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీలోని ఆటో సూచీ తప్పితే మిగిలినవి మొత్తం లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. డీసీబీ బ్యాంక్‌ షేర్లు 14శాతం కుంగాయి. ఈ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసికానికి అంచనాల కన్నా తక్కువ స్థాయిలో ఫలితాలను ప్రకటించడంతో షేర్లు పడిపోయాయి. ఎన్‌పీఏల ఒత్తిడి కూడా దీనిపై తీవ్రంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ నేడు ఏడు శాతం పెరిగింది. నిన్న కంపెనీ నికర లాభంలో 42శాతం వృద్ధి నమోదు చేయడంతో నేడు ఆ షేరు భారీ ర్యాలీ నమోదు చేసింది.