Stock Market: ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది.. నిపుణులు ఏం చెబుతున్నారు..

గత వారం దేశంలోని అత్యంత విలువైన 10 కంపెనీలలో ఐదు కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,01,145.09 కోట్లు పెరిగింది...

Stock Market: ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది.. నిపుణులు ఏం చెబుతున్నారు..
Stock Market
Follow us

|

Updated on: Dec 26, 2021 | 12:23 PM

గత వారం దేశంలోని అత్యంత విలువైన 10 కంపెనీలలో ఐదు కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,01,145.09 కోట్లు పెరిగింది. గత వారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, విప్రోలు లాభపడగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫైనాన్స్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్షీణించాయి. గత వారం BSE సెన్సెక్స్ 112.57 పాయింట్లు పెరిగింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,720.62 కోట్లు పెరిగి రూ.13,57,644.33 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,04,154.56 కోట్లుగా ఉంది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,656.95 కోట్లు పెరిగి రూ.7,83,779.99 కోట్లకు చేరగా, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ రూ.16,000.71 కోట్లు పెరిగి రూ.5,40,053.55 కోట్లకు చేరుకుంది. విప్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,730.86 కోట్లు పెరిగి రూ.3,82,857.25 కోట్లకు చేరుకుంది.

మరోవైపు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,619.95 కోట్లు తగ్గి రూ.7,97,609.94 కోట్లకు చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,083.97 కోట్లు తగ్గి రూ.4,58,838.89 కోట్లకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.9,727.82 కోట్లు క్షీణించి రూ.4,07,720.88 కోట్లకు చేరింది.

ఒమిక్రాన్ కేసులు, నెలవారీ డెరివేటివ్స్ డీల్‌లు పూర్తయిన నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్లు అస్థిరతను చూడవచ్చని విశ్లేషకులు అంటున్నారు. “ఒమిక్రాన్ చుట్టూ ఉన్న భయాందోళనలు, నెలవారీ డీల్‌ల ముగింపు కారణంగా మార్కెట్ అస్థిరంగా ఉంటుంది.” అని సామ్‌కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యేషా షా అన్నారు.

“మార్కెట్ కోవిడ్ పరిస్థితిని గమనిస్తోంది. ఏదైనా సానుకూల వార్తలు మార్కెట్‌కు కొంత బలాన్ని ఇస్తాయి. లేకుంటే అస్థిరత కొనసాగుతుంది.” అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. విదేశీ పెట్టుబడిదారుల వైఖరి, రూపాయి కదలిక, ముడి చమురు ధర కూడా మార్కెట్‌కు ముఖ్యమైనవని పేర్కొన్నారు.

మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్‌ కారణంగా మార్కెట్ అస్థిరంగా ఉండే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా అన్నారు.

Read Also.. Personal Finance: ఈ నాలుగు పనులను డిసెంబర్ 31లోగా పూర్తి చేయండి.. లేకుంటే..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు